మితి_పరిమితి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:కాటేగారు పాండురంగ విఠల్
వేసవి తాపంకు జతగా బడులకు సెలవులు
పక్కింటి రాజేష్ నెత్తి నోరు బాదుకుంటూ వచ్చాడు
మహేష్ తో బాధ వెళ్లబోసుకున్నాడు
డోలు పోయి మద్దెలతో చెప్పుకున్నట్లన్నది
ఫోనులో వీడియో గేములు శబ్దాలు
రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తలపిస్తున్నాయని
కాశ్మీరు బార్దర్లో వున్నట్లుందని ఎడ్వలేక ఏడుస్తూనే
నవ్వలేక ఏడుస్తూనే చెప్పలేక ఏడుస్తూనే
ఎడ్పుముఖంలో నవ్వుపుట్టిస్తుంటే అది చూసి విని
మహేష్ ఎడ్పునే నావ్వుగా మార్చి
సానుభూతి చూపాలో
పొద్దున్నుంచి గుండీలు బాడుకున్న
గుర్తులు చూపాలో
తెలియక తెలుగు సినిమాలో
జోకర్లా నవ్వుతున్నాడు
మహేష్ పిల్లలిద్దరూ పిల్లల్లా!కాదు పిడుగులు
అంతరిక్షం నుంచి దిగివచ్చిన చిచ్చెర పిడుగులు
తల బొప్పి కట్టిందని మహేష్ ఏడుస్తుంటే
వేలు తెగిందని రాజేష్ పెడబొబ్బలు పెడుతున్నాడు
ఇది ఇంటింటి రామాయణమే
ప్రతి నిమిషం ఇంట్లో రావణ కాష్టమే
పిల్లల ఆటలు పెద్దలకు యమ గండాలు
మాటలు లేవు పాటలు లేవు
గన్నులు బాంబులు రాకెట్ల దాడులే
దీనికి పరిష్కారం ఉపగ్రహాల విధ్వంసం
టవర్ల కూల్చివేత ప్రతి ఇంట్లో జామర్ల ఏర్పాటే!
మితిలో వుంటే సంతోషం! పరిమితి దాటితే విషాదం