అమూల్యమైన ప్రేమ

అమూల్యమైన ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నరసింహా రెడ్డి.

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
అంటూ గుడిమెట్ల ముందు పాటపడుతూ ఆడుకుంటున్న నాకు ఒక్కసారిగా ఎదో ఒకరకమైన వాడిపోయిన పూల వాసన తో చిన్న గాలి వీచింది.
నా కనులు నెమ్మదిగా పైకి చూసాయి.
ఒక అందమైన చేయి.. ఆ చేతికి రంగు వెలిసిపోయిన రబ్బరు గాజులు.
వేళ్ళకి ఎవడో వాడి పారేసిన ప్లాస్టిక్ ఉంగరాలు.
ఆ చేత్తో నా చిప్పలో రెండు రూపాయల బిళ్ళ వేసి రెండు ఐదు రూపాయల బిళ్ళల్ని తీస్కుకుంటోంది.
అలాగే ఇంకొంచెం పైకి చూసాను.. ఆహా మసీగుడ్డను మించిపోయే అందమైన చిరుగుల డిసైన్ తో కట్టుకున్న చీర..ఇంకాస్తా పైకి చూసాను ఆహా అప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేస్కునే పెషెంట్ సగంలో పారిపోయొచ్చినట్టు.. సొట్టలు తీసేవాడి చేతిలోని బిందె లాగ.. ఆహా ఎంత వికృతందమైన పేస్.
ఆలా చూస్తుంటే అడుక్కోకుండానే నా చిప్పలో చిల్లర శబ్దం లాగ నా గుండెలో ఒక శబ్దం మోగింది.
అనుకోకుండానే నా చేయి నా తల మీదకి వెళ్లి చిల్లరకోసం వెతుక్కున్నట్టుగా ఒకటే గోకుతుంది.
ఒక్క మాటలో నా ఈ ముష్టి సామ్రాజ్యనికి మహారాణి దొరికిందన్పించింది.
అలాగే తన కళ్లలోకి చూసాను అబాబాబా అప్పుడే కాకి కొరికేసిన నేరేడు పళ్ళ లాంటి కళ్ళు.
తన కళ్లలోకి కళ్ళు పెట్టి చూడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ఎందుకంటే ఒకటి తూర్పు రెండోది పడమరకి చూస్తున్నాయి. ఎంతో మందిలో ఒకరికి దక్కే అదృష్టం అది ఈ రోజు నాకు సొంతమవుతుందంపించింది.
తను కూడా నా అసహ్యాందమైన పాడుబడ్డ బిల్డింగ్ కి కట్టిన దిష్టిబొమ్మ లాంటి మొఖాన్ని చూస్తూ ఒక్క చిరునవ్వు విసిరింది అబాబాబా..ఆ నవ్వుతో నా మనసుకి గోక్కోకుండానే దురద తీరినంత హాయ్ గా అన్పించింది.. ఆహా ఆ పెదాలు మాడిపోయిన దొండకాయ వేపుడు లా ఎంత నల్లగా ముదిరిపోయి ఉన్నాయో… ఆహా ఆ పళ్ళు చిన్నప్పుడు చుసిన పళ్ళ పౌడర్ ఆడ్ లో తొమకముందు చూపించే పళ్ళలా, బొగ్గుతో సగం తోమి కడుక్కోకుండా వదిలేసినట్టుగా ఎంత నల్లగా నిగనిగాలాడుతున్నాయో..
ఆహా జలపాతాల్ని తలపించే ఆ చీమిడి ముక్కు..
ఇంక ఆ జుట్టు అబాబాబా ఇప్పుడే ఓలిచినా కొబ్బరి పీచులా బూడిద రంగుతో ఆహా…
ఆ నడుము కాదది చిన్న సొట్ట పడ్డ గంగాలం లా.. అబాబాబా మొత్తానికి ఆ బ్రహ్మ దేవుడు నాకోసమే స్పెషల్ గా చెత్త లోకాన్ని సృష్టించి అక్కడ కూర్చొని కుప్పలోంచి వెతికి మరీ తీసి తయారు చేసినట్టుగా ఎంత మందంగా చెక్కడో ఈ శిల్పన్ని.
గోక్కునే నా చేతితో, నా చిప్పలోని చిల్లర లక్కేళ్తున్న తన చేతిని అందుకొని వెనక్కి లాగి.. తన మొహం లో మొహం పెట్టి కంపుకొడుతున్న నా నోటితో ఒక్క లిప్ కిస్ ఇచ్చి చెప్పాను ఐ లవ్ యూ అని అంతే
సిగ్గుతో నా చేతిని విధుల్చుకొని ఎక్కడికి వెళ్లిందో ఇంకా తిరిగి రాలేదు తనకోసం వెతకని గుడంటూ లేదు… తిరగని వీధి అంటూ లేదు.
మీకేమైనా కన్పిస్తే పాపం
ఈ నెంబర్ కి మెస్సేజ్ చేయకండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!