నా చెలి సొగసు
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: శ్రీవిజయ దుర్గ ఎల్
ఆహా!
కన్నులా ఇవి..
ఆ కలువలు చిన్నబోవా, నా చెలి కనులను చూడ!
నాసికమా ఇది..
సంపెంగలు వాడి పోవును, నా చెలి నాసికను చూడ!
అధరములా ఇవి
గులాబీ రేకులు వెల వెల పోవును, నా చెలి అధరములు చూడ!
తామరలు తరలి పోవును, నా చెలి చెక్కిళ్ళను చూడ!
శంఖమునకే పరీక్ష విధించెను, నా చెలి కంఠము!
పర్వతములు పక్కకు ఒరిగెను, నా చెలి సొగసును చూడ!
నెలవంకలు నాట్యమాడెను, నా చెలి నడుములోని వయ్యారమూలో!
ఆహా! చెలీ… ఈ సొగసంత నాకోసమా!
చెక్కిళ్ళలో పూసిన, ఈ మందారాలు నా కోసమా!
సిగ్గుతో దాయకుమా! నీ సొగసుని,
కాస్త అందించుమా! నీ ప్రాణ సఖునికి..
ఓహో!
నా ప్రాణసఖి..
నీకై ఎన్నాళ్లో వేచిన, నా హృదయం!
ఇక పై తాళ లేకున్నది, ఈ విరహం
నా యందు దయ వుంచి,
నా కనుల ముందుకు రావా ప్రియా..
ఈ విరహ వేదన తీర్చ రావా ప్రియా…
