జతగాడ నిన్ను దాటి పోగలనా
అంశం: నిన్ను దాటి పోగలనా
కలహంతో జత అయ్యి
కనురెప్ప పాటులో దూరమైన
కనులలో నిలుపుకునే నేను
నిన్ను దాటి పోగలనా!!
అలుపెరుగని బాటసారిలా
అలుపెరుగని నీ పయనంలో
జతగా నడవాలని.. నీ
దరి చేరాలని చూసే నేను
నిన్ను దాటి పోగలనా!!
నక్షత్రాల మెరుపు వెలుగులు
నీ ముఖ చిత్రంపై నాట్యమాడాలని
నవ్వుతూ ఎదురొచ్చే నేను
నిన్ను దాటి పోగలనా!!
బుజ్జగింపుల పరదాలొ
దోబుచులాటల సరదాలో
నను కవ్వించి, మురిపించే
నీ చూపుకు దొరకకుండా
నిన్ను దాటి పోగలనా!!
రచయిత :: “దీపు” వీర
బాగుంది మీ.. అందమైన పద కవిత👏👏👏😊