నిను చేరితే చాలు

నిను చేరితే చాలు

అంశం: నిన్ను దాటి పోగలనా

మనసువిప్పి మాటలాడ మది తొందర పెడుతుండగ,
కనుల ముందు కలల రాణీ కదలాడుతూ వుండగా..
పెదవి దాటి రాని మాట కళ్లతోనే చెప్పగా..
లబ్ డబ్ మని  గుండె సడి వేగాన్ని పెంచగా..
ఉచ్వాస నిచ్వాసం నిను చూసి ఆగగా…
ఏమవుతానో నేను ఎదురుగ నువు కనపడితే..

ఏం మాయ చేసావనీ ఎద నే నే అడగనా…
నిమిషమైన నిలబడనని పాదాలు పరుగులిడవా..
నిన్ను నేను చేరాలని ,
నిను చేరి కదలాలని,
నిత్యం నీ తలపులలో తలమునకలై నిలిచాను.

ఎడబాటు పొరపాటున కూడా రావొద్దని,
తడబాటు లేకుండా తనువు నీకు ఇచ్చానని,
ఒంటరిగా ఊసులాడే నీతో నా ఊహలు .
జంటగ నిను పొందాలని తపించే ధ్యాసలు.
నీవుతప్ప కనపడదు వేరేది నా కనులకు.
నీ మాట తప్ప వినపడదు ఇంకేది నా వీనులకు.
నిను దాటి పోగలనా నను నేను మరచినా..
నిను తప్ప ఇంకెవరిని పూజించను నా హృదయాన..
మరుజన్మలో కూడా నిన్నే కోరుకొని జీవిస్తా..
మరుజన్మ ఇస్తానంటే నీకై ఈ క్షణమే మరణిస్తా…

రచయిత :: కంచుబారికి చిన్నారావు

You May Also Like

4 thoughts on “నిను చేరితే చాలు

  1. చాలా అద్భుతంగా రాసారు సర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!