కొరతలమయం
రచయిత :: వాడపర్తి వెంకటరమణ
ఏముంది గర్వకారణం
ఎటుచూసినా కొరతలమయం
ఆయువు పోయాల్సిన
ఆసుపత్రులిప్పుడు
ఆక్సిజన్ కొరతతో
అల్లాడిపోతున్నాయి
ప్రాణాలు నిలబెట్టడానికి
పరుపులు కరువై
ఆపన్నహస్తాల కోసం
చకోరాలై ఎదురు చూస్తున్నాయి
ఆపదలో అవసరమైన
టీకాల ప్రాణవాయువులు
చీకటి సామ్రాజ్యంలో
చక్కర్లు కొడుతున్నాయి
ఈ కొరతల కాష్టంలో
ఒక్కో దీపం కొండెక్కుతూనే ఉంది!