ప్రక్రియ :: సున్నితం
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు
రచయిత :: మైలవరపు వెంకట పద్మావతి (విజ్జేశ్వర్)
మొక్కలు పెంచు అవి
మనకు పూలు,పండ్లు
ఇచ్చి ఆనందం నిచ్చును.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
ఎన్నెన్నో మొక్కలు చూడగా
పూవుల రంగులు వేరయా
అవన్నీ చేరును పూజకే
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
మొక్కలు పరులకు ఉపకారం
చేయును అవి మనకు
ఆనందాన్ని, సంతోషము నిచ్చును.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
మొక్కల దళములను కోసిన
తిరిగి దళములు వచ్చును
ఇదియే ప్రకృతి మహిమ
చూడ చక్కని తెలుగు సున్నితంబు.
మొక్కలను రక్షించు అవి
మనకు ప్రాణవాయువు నిచ్చును
మొక్కలే రేపటి చెట్లు.
చుడ చక్కని తెలుగు సున్నితంబు.