(అంశం : నా అల్లరి నేస్తం) తొలిముద్దు
రచన :: పద్మావతి తల్లోజు
ఏదో చేయాలనే ఆరాటం!
ఏమీ చేయలేని మొహమాటం!!
తెలిసి తెలియని వయసులో
చేయాలనుకున్న సాహసం!
కుర్రకారు నేస్తాలు వెనక నుండి
ఇచ్చిన ప్రోత్సాహం!!
ఎవరైనా చూస్తారేమోననే భయం!
ఈ క్షణం గడిస్తే మళ్లీ రాదన్న తాపత్రయం !!
అది హద్దులు దాటి ,
అవరోధాలను అధిగమించిన
తర్వాత ..,
నేస్తం!
నీవు తొలిసారిగా
ముచ్చటగా నా బుగ్గ పై
ముద్రించిన తొలిముద్దు !
ఓహ్…
అప్పుడు నాకు కోపం రాలేదు
సరికదా …
నీవు చొరవ తీసుకున్న ఆ క్షణమే
అద్భుతంగా అనిపిస్తుంది
నాకేప్పుడు….!