అలసిన బతుకులు
రచన::పి. వి. యన్. కృష్ణవేణి
నిండు కుండలాంటిది ఈ జీవితం
కష్టాలు, కన్నీళ్ళు దిగమింగుకుని
అవరోధాలను అధిగమించుకుంటూ
సాధించాల్సిన విజయాలను సాధిస్తూ
భవిష్యత్ కోసం తీపి కలలను కంటూ
ఒక శ్రామికుడిలా శ్రమిస్తూ కష్టీస్తూ
స్వార్థం లేని ప్రేమను కుటుంబానికి పంచిస్తూ
తన ఉనికిని తానే మరచిన వ్యక్తి
అలసిన బతుకును సేదతీర్చటానికే
శాశ్వత నిద్రలోకి జారుకున్న ఓ త్యాగమూర్తి
ఓ చిరు ఉద్యోగి, ఓ చిన్న కారు రైతు అయిన ఓ అబాగ్యుడు..