చల్లని లేపనము
రచన ::పిల్లి.హజరత్తయ్య
మనసులోని నిజాయితీని వెలికితీసి
నిర్మలమైన అద్దంలా స్వచ్ఛంగా మార్చి
సమస్త దురాలోచనలను పోగొట్టి
అంతఃకరణ శుద్ధిని గావించే
నిజరూపం నకిలీయే ప్రతిబింబము..!
దెబ్బతిన్నా శరీరానికి ఉపశమనం కలిగించేలా
ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనశ్శాంతిని
కలిగించు చల్లని లేపనము..!
పక్కవాడి ప్రాణాలు నిలిపేలా
హుందాతనం ఉట్టిపడేలా
మనిషి విలువను పెంచు తత్వము..!
వ్యక్తి ఆలోచనలు విశ్లేషించి
వాస్తవాలను క్రోఢీకరించి
వ్యక్తి ప్రవర్తనను అంచనావేసి
పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే
సహజ ప్రక్రియ ప్రతిబింబము..!
జీవితానికి పరమార్థం చేకూర్చే
మనసు లోతుల్లో దాగిన రూపము..!
మనిషి ప్రతిబింబం మహోన్నతమైనది..
మంచివైపు మనల్ని మళ్ళిస్తుంది..!