తెలియదు
రచన:: రాయల అనీల
పూచే పువ్వుకు ,రాలే ఆకుకూ తెలుసు
ఆ పువ్వు అందమైన రూపం మరునాడుకు వాడిపోతుందని…..
ఆ ఆకు చిట్టి జీవితం శాశ్వతం కాదని ……..
వాటిలానే నా జీవితంలోని వెలుగు కూడా అల్పకాలమే అని తెలిసినా నా మది ఎందుకు తృప్తి చెందట్లేదు………
వాటికున్న విజ్ఞానం నా మదికి లేకనా
నీ మీద నాకున్న ప్రేమలా వాటికి లేకనా……..
తెలియదు…….. నా మదికి ఏమి తెలియదు
కేవలం నీ నవ్వు తప్ప……..
తెలుసుకోదు…….. నా మది ఏదీ తెలుసుకోదు
కేవలం నీ ప్రేమ తప్ప……..
ఈ నవ్వు, ఈ ప్రాణం , ఈ ప్రేమ ,ఈ జీవితం……..
అన్నీ నీవే…. నీకే సొంతం
@@@