పట్టుదల
రచన: సంజన కృతజ్ఞ
ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు.
ఎత్తులకు పైఎత్తులువేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని యిద్దరూ ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మిక్కిలి అలిసిపోయాడు వంటినిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది తాను నెగ్గడం ఎటు కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్క దారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు.
అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది అది క్రింది నుండి పైనున్న తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది క్రిందికి పడిపోతుంది ఒకసారి కాదు అనేక సార్లు అది క్రింద పడిపోయింది అయినా అది తన ప్రయత్నం మానక 17వ సారీ తనగూటికి చేరుకుంది.
దానిపట్టుదల చూచిన రాజు జ్ఞానోదయమైంది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు.
ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్లీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణనిచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువైన పెద్ద సైన్యంగల రాజే ఓడిపోయాడు .
చిన్న రాజు విజేత అయ్యాడు.
****