(అంశం:”అగమ్యగోచరం”)
నీతో వేసిన ఏడడుగులు
రచన ::సుజాత కోకిల
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైనా!
మన జీవితం ఏడు అడుగులతో!
మన ప్రయాణం మొదలయ్యింది.
నీతో వేసిన ఏడడుగుల బంధంతో,
నెే అనుభవించిన జీవిత మాధుర్యాలు.
నీ అర్ధాంగిగా కష్టసుఖాలు పంచుకున్న!
నేను ఎనలేని బంధాన్ని పెనవేసుకున్న !
నీతో కీర్తించిన నా జీవితం సఫలీకృతమై!
మచ్చలేని మన జీవితాలు నీతి నిజాయితీలకు.
మారుపేరుగా నిలిచి మనతో పెనవేసుకున్న?
బంధాలకు మన జీవిత మరణాంతరం వరకు,
తోడునీడగా నిలిచి దారి చూపే బాటసారుల మై!
పూల పాన్పులు పరవాలని ఆశించే మనకు,
మన జీవిత ఆశయాలను మార్చి,
మన బాటలకు బీటలు వెేసి మన జీవితాన్ని ?
అగమ్య గోచరంగా మారుస్తారని అనుకున్నా
మా మంచిని సాధించాలని అడుగులు వేద్దాం!
అవెే మంచి పునాదులు కావాలని ఆశిద్దాం !
***