(అంశం:”బానిససంకెళ్లు”)
అధికార దాహం
రచన:పి.వి.ఎన్. కృష్ణవేణి
మనిషిలోని అహానికి ప్రతీక ఒక మనసులో నిండే అహంకార సూచిక
నీకు నువ్వే సాటి ఈ ఇలలో ఇక
నీ అధికారమే నీకు బలమగునిక
మనసున మానవత్వం కనుమరుగయ్యేను
నీ తలపులే చిన్నాభిన్నం అయ్యెను పదవి కిరీటం తలచేరగా మనిషే మారిపోయేను
అధికార దాహంతో విలువలను మరచిపోయెను
బానిస సంకెళ్ళలో నలిగిన మనుషులు
కలత చెందిన ఎన్నెన్నో మనసులు
నీ వృత్తి ధర్మం అని నువ్వు
భావింనేల
లోలోన, నీ ఉద్యోగులు కుంగి కృశించనేల
అధికారం కాదు అభిమానంతో మార్చుకో
అంధకారం కాదు మానవత్వం ఉండాలని తెలుసుకో
డబ్బు ఒక్కటే కాదు ప్రధానం గమనించుకో
మనుషుల నీకు ఇచ్చే విలువను కాపాడుకో
వేతనాల కోసం బానిస బ్రతుకులు వారు ఏమి చేశారు తప్పిదములు
సహకారంతో కలుగును ఆనందములు
ఎన్నటికీ శాశ్వతము కావు ఈ పదవులు