ఎవరు?!
రచన: సుజాత.పి.వి.ఎల్
ఏడు రంగులని కూర్చి
‘హరివిల్లని’ నామకరణం చేసి
ఆకాశాన నిలిపిందెవరు?
రెక్కలకి రంగులద్ది
సువాసనలదిమి
పూల వనాన్ని తీర్చిదిద్దిందెవరు?
కనిపించని మనసులో
అనేకానేక అరలుంచి
మధుర స్మృతుల
తేనె నింపిందెవరు?
మహోన్నతమైన జీవితాన్ని
స్ఫురించే మనసునిచ్చి
జీవితకాల మధురానుభూతుల్ని
సొంతం చేసుకురమ్మని
‘ఇల’ పైకి పంపిందెవరు?!
***