కడలి
రచన: పద్మజ రామకృష్ణ.పి
సముద్రపు ఘోష నా మది
శ్వాస..ఎగసిపడే కెరటాలు నా
ఆలోచనల భావాలు..
నా కంటి భాష తీరంలో సుడిగుండాలు..ఒడ్డుకు చేరని అలలే నా స్నేహాలు..ఎర్రని తాపంతో తాకే సూర్యుని స్పర్శ నా కడలికి విడదీయని
బంధాలు..
కడలి-ప్రతి భావాలకు భావ తరంగాలు
పాపాలు శాపాలుగా మారితే నా దాహానికి సునామీల పర్వం పుణ్యాత్ములనూ వదలక
కలిపేసుకుందును నా కడలి గర్భమునందు….ఎన్నో జీవరాసులకు జీవనాధారాన్ని.
క్రమశిక్షణ కలిగిన చెంత వినోదాన్ని. శ్రుతిమించితే కబళించే మృత్యువును..
కొందరి తల్లుల కడుపు కోతకు కారకురాలిని..ఎందరో కవులకు వర్ణించే కవిత్వపు కవ్వింతను..
దేశానికి మించి వ్యాప్తి చెంది
విహరిస్తున్నాను ఆకాశమే హద్దుగా…