మానవత్వమా నీవెక్కడ?
రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్
పాలుగారె బుగ్గలతో
విచ్చుకుంటున్న గులాబీలలా
చిలుక పలుకు పలుకుతూ
బొమ్మలతో బొమ్మలాగ ఆడుతూ, పాడుతూ
అమ్మ నాన్నల ఆప్యాయత అనురాగల మధ్య గడపవలసిన అపరంజి బొమ్మలా ఉన్న పసిపిల్లలపై
నేటి సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలను చూస్తుంటే
మానవ మృగాల మధ్య ,
నరరూప రాక్షసుల మధ్య
మనమున్నామా అనిపిస్తుంది.
ఎన్ని చట్టాలు వచ్చిన దోషులు నిర్భయంగా నడివీధిలో తిరుగుతుంటే
మానవత్వమా నీ వెక్కడ?
సమాజమా నీ పయనమెటు?