అమ్మా

అమ్మా

రచయిత:: సుశీల రమేష్

 
దైవానికి మారుపేరు అమ్మ!

ప్రేమకు ప్రతిరూపం అమ్మ  !

సృష్టికి మూలం అమ్మ.  !

బిడ్డల క్షేమాన్ని కాంక్షించేది అమ్మ !

కంటికి రెప్పలా కాపాడేది అమ్మ !

తన  మమతనంతా గోరుముద్దలుగా తినిపించేది అమ్మ !

తన రుధిరాన్ని క్షీరంగా మార్చి  ఆకలి తీర్చేది అమ్మ !

తన ఊపిరి ని బిగబట్టి నాకు ఆయువును పోసింది అమ్మ !

నిస్వార్థ సేవకు రూపం అమ్మ !

భవబంధాలను తెంచుకో గలము కానీ, తెంచుకోలేని పేగుబంధం అమ్మ !

నా బలం ధైర్యం నువ్వే అమ్మ !

ఎలా తీర్చుకోగలను నీ రుణం అమ్మ!

అందుకే అనుసరిస్తాను నేను మా అమ్మను !
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!