అనుక్షణం నీ ప్రేమకై

అంశం: ప్రేమలేఖ

అనుక్షణం నీ ప్రేమకై
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పోలగాని. భానుతేజశ్రీ (భానోదయం)

పలకరించాలన్న తపన పెదవులపై ఆగిపోతుంది
చూపులు మాత్రం అనుక్షణం నిన్నే వెతుకుతున్నాయి..

వేసే ప్రతి అడుగు గమ్యం నీవే కావాలని ఆరాటపడుతున్నాయి..

ఎన్నో సందేహాలు నా మస్తిష్కాన్ని ఇబ్బంది పెడుతున్నా
కంగారు పడకుండా నా మనసు మాత్రం నిన్నే ఆరాధిస్తుంది..

నీ చెంత చేరాలని,నీ పలకరింపు కావాలని, నీతో ముచ్చట్లు చెప్పాలని,
నీ సన్నిధిలో నా జీవనం సాగాలని….

కన్నుల నిండిన నీ రూపాన్ని నా కనుల ఎదురు చూడాలని
మనసులో నిండిన మాటలన్నీ నీకు చెప్పాలని…

ఆకాశమంత ప్రేమ గుండెల్లో దాచాను
మది మొత్తం నీ ఊసులే నింపాను….

ఊహకందని నీ రూపాన్ని ఊహిస్తూ కుంచెలలో బంధించి
నా మనసు కాగితంపై నీ రూపాన్ని గీస్తున్నా
ఎన్నటికైనా నా కోసం నువ్వు వస్తావని
నీ ప్రేమ నాకిస్తావని
అనుక్షణం నీ ప్రేమకై…
********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!