ఆశలు అందాలు

ఆశలు అందాలు

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు పరుగులో మనిషి జీవితం ముడిపడి ఉన్నది. ఆశలు ఆశయాలు ఉదయం లేచింది మొదలు అపురూప ఆలోచనలతో నిరంతరం తరం తరం మదిలో ఆశల మమతలు కదలాడుతు భవిష్యత్తు కోసం కలలు కాంటు ఆశల సౌధం నిర్మించడంలో ప్రతి మనిషి ఘనులు, ఆయితే కవులు కళకారులు మరింత ఎక్కువ సౌధాలు నిర్మిస్తారు మనిషి జీవితానికి ఒక ప్లాన్ ఉండాలి.
రమేష్ ఒక పెద్ద కంపెనీలో డైరెక్టర్ దేనికీ లోటూ లేదు. అన్న గారు చదువు కాగానే విదేశాలకు ఉద్యోగ అవకాశం ద్వారా వెళ్లి పోయి అక్కడే సెటిల్ అయ్యి అక్కడి పిల్లను పెళ్లి చేసుకున్నాడు. మధ్యలో ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు బంగారు బొమ్మల మాదిరి ఉంటారు. తండ్రి వ్యవసాయదారుడు తల్లి సంప్రదాయం పూజలు పుణ్యాలు అంటుంది. అతిథి అభ్యాగతి శ్రద్ద అన్ని ఉన్న కుటుంబము. పద్ధతిగా పిల్లల్ని పెంచారు, డిగ్రీ కాగానే పెద్ద పిల్ల రూప పెళ్లి ఆడపడుచు కొడుకు రమణతో చేశారు. అగ్రి కల్చర్ బీ ఏ సి చదివి ఉన్న పది ఎకరాలు తనే చూసుకుంటూ ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేస్తూ ప్రభుత్వ అవార్డ్స్ పుచ్చుకుంటూ బాపట్లలో ఉన్నారు. అక్కడ అగ్రికల్చర్ యూనివర్స్ టీ ఉన్నది తరచూ అక్కడ జరిగే సభల్లో పాల్గొని కొత్త వంగడాలు పంటలు గురించి తెలుసుకుంటే చాలు అందుకని వ్యవ సాయం అంటే ఇష్టం ఇది ప్రకృతి ఆధారము. పిల్లలు ఇద్దరు హైస్కూల్ లో చదువుతున్నారు.
రెండో పిల్ల రాగిణి లెక్చరర్ అల్లుడు లెక్టరెర్ ఇద్దరు ఒకే కాలేజీ లో చదువుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ జీవితం వారుధి ఇద్దరు పిల్లలు కాన్వెంట్ విద్య.
మూడో పిల్ల రమ్య డాక్టర్ చదివింది. అది పెళ్లి చేసుకో అంటే చేసుకోదు ఎవరితో నాకు కుదరదు అంటుంది. దానికోసం రమేష్ పెళ్లి వాయిదా పడింది. చాలా సంభందాలు వచ్చాయి కానీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే తన పిల్లకి సుఖం ఉండదని కొన్ని సంభందాలు వెళ్లి పోయాయి.రమ్య పెళ్లి ఎప్పుడు? జరిగెను, రమేష్ పెళ్లి ఇంకా ఎప్పుడు? ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానం ఆడపిల్ల పెళ్ళి తరువాతే అని వస్తుంది.
ఓ పెళ్లిళ్ల పేరయ్య పట్టు వదలని విక్రామర్కుడిల సంభందాలు తెస్తూ చూపిస్తూ ఉన్నాడు. ఒక సంబంధం బాగుంది ఆడపిల్ల హోమ్ సైన్స్ బీ ఏ సి చదివింది. పిల్లాడు డాక్టర్ చదివాడు కుండ మార్పిడి పెళ్లి చేస్తే సరి అన్నారు పిల్లాడు పుష్టిగా ఉన్నాడు. మన పిల్ల నాదరుగా ఉంటుంది డాక్టర్ చదివి అలసిపోయింది.
రమేష్ నాజూకుగా అందంగా ఉంటాడు అసలు వాళ్ళ ఇంట్లో అడ మగ అందగానే ఉంటారు.
పెళ్లి వారు సంబంధం చూడటానికి వస్తారు మీ అమ్మాయి వాళ్ళకి నచ్చింది. పిల్లాడి పేరు సతిష్ పిల్ల, పేరు సత్య శ్రీ అన్నాడు. జాతకాలు గ్రహాలు అన్ని బాగున్నాయి, మీ అమ్మానాన్న వృద్ధులు అయ్యారు నువ్వు పెళ్లికి వప్పుకుంటే అన్నయ్య పెళ్లి కూడా అవుతుంది. ఈ సారి నువ్వు ఈ సంబంధం వదల వద్దు అని పెళ్లిళ్ల పేరయ్య చెప్పారు.
రమ్య ఆలోచనలు పెళ్లి వైపు మళ్ళాయి తన తల్లి తండ్రిని సంతోష పెట్గి తనకంటూ ఒక స్వతంత్ర జీవితం ఏర్పాటు చేసుకోవాలి అలా అలోచించి. పెళ్లి చూపులకి వప్పుకున్నది.
ఏమిటో పెళ్లి కావాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. అమ్మాయిలు అదే అబ్బాయి అయితే ఎలా ఉన్నా మగ మహారాజు ఈ సామెత. మారదు కట్నం కానుకలు అన్ని ఘనంగా పెడతారు
వాళ్ళు మంచి వాళ్ళు పిల్ల లావు సంగతి వదిలే రెండు పురుళ్లు అయ్యేటప్పటికి చిక్కి పోతోంది తొగరు దారంలా ఉంటుంది అప్పుడు నువ్వు లావు అవుతావు బలవడానికి నీ బావమరిది చెల్లెలు మందులు ఇచ్చే పరిస్తితి వస్తుంది పెళ్లిళ్ల పెరయ్య. ఎంతో హాస్యంగా చెప్పాడు.
వినడానికి విసుగ్గా ఉన్న జీవిత నిత్య సత్యం అదే ఇంటి పరిస్థితులు తిండి విధానం.అన్ని మార్పులు వస్తాయి వాటిని తట్టుకుని నిలబడాలి అని నవ్వాడు. రూప ఎప్పటి లాగానే సింపుల్ గా ఉన్నది రోజు వేషమే ప్రత్యేకత ఏమీ లేదు. పెళ్లి చూపులు అయ్యియి పిల్ల నచ్చింది పిల్లాడికి ఇంకా వాళ్ళ పిల్ల నచ్చాలి అన్న చెల్లి ఒక ఇంటికి అల్లుడు కోడలు గా వెళ్ళటం మంచిదే అయినా ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకడం కస్టమ్ కూడా, అందుకే రమ్య వప్పు కొగనే రమేష్ కూడా వప్పుకున్నాడు. కానీ ఎప్పుడు ఆడపిల్లలు కనీసం పెళ్లి కావాలి అనుకున్నప్పుడు శరీర సౌష్టవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఓ పిజ్జాలు బర్గర్ లు స్వీట్స్ తిని జ్యూస్లు తాగి పెరగ కూడదు అలాగే అబ్బాయి అయినా మంచి శరీర సౌష్టవం ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి ఈ తరం వారు ఇలా అమ్మాయిలు అబ్బాయిలు జాజి మోగ్గాల్ల ఉంటున్నారు.
రమ్య తల్లి మాత్రం సంప్రదాయంగా ఉన్నారు ఇప్పుడు వప్పుకొ రమ్య అని చెప్పింది పిల్ల తెల్లగా లావుగా ఉన్నది. ఒక విధంగా పెళ్లి విషయానికి వస్తె సమస్యలు తప్పడం లేదు ఆడపిల్ల పెళ్లి ఏ కాలమైనా వక్కటే అందము డబ్బు చదువు సంస్కారం ఉండాలి మాఇంట్లో కలిసి పోవాలి అని అంటారు.
కానీ అత్తింటి వారు పిల్లని బాగా చూసుకుని అధబడు చులు కలిసి మెలసి ఉంటే భర్త ప్రేమగా చూస్తే నే అత్తింటా ఉండగలదు కానీ ఇంటికి వచ్చిన కోడల్ని విచిత్రం చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఆమె ఎప్పటికీ ఆత్తింటా కలవ లేదు.
పెళ్లికి ముందు కేవలం తల్లి తండ్రి పిల్లాడు వచ్చి చూస్తారు. పెళ్ళిలో ఎంతో మంది బంధువులు వస్తారు.
ఇక్కడ అసలు కథ మొదలు అవుతుంది.
ఏరా నీ పెళ్ళాం అలా ఉంది ఇలా ఉంది అంటూ పెద్దమ్మ పిల్లలు పెద్ద నాన్న పిల్లలు మేనమామ పిల్లలు ఎలా ఎవరో ఒకరు పుల్లలు పెట్టీ వెడతారు అప్పటినుంచి వీళ్ళలో మార్పు వస్తుంది. పిల్ల కలివిడిగా ఉంటే మీ ఆవిడ ఇంటి పెత్తనం చేస్తుంది అంటారు ముభావంగా ఉంటే దానికి గర్వం ఎక్కువ అంటారు. ఇలా పెళ్ళిలో చాలా రకాల అభిప్రాయాలు వెళ్ళదిస్తారు. దీనివల్ల పెళ్ళిలోనే పిల్లాడికి పిల్లకి మధ్య భేదాన్ని సృష్టిస్తారు అసలు వారికి ఏమి పట్టింపులు లేకపోయినా కొసరు వాళ్ళు గొడవలు పెట్టే ఆనందం వ్యక్త పరుస్తారు. పెళ్లితో మనిషి ఆశల సౌధాలు ఉన్నతి అయినా విచిత్రంగా మారినా అతి సయొక్తి కాదు. ఆడ పిల్ల అయిన మగ పిల్లాడు అయిన పెళ్లితో జీవితం మారుతుంది.
రమేష్ జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టు కున్నాడు కానీ చెల్లి కోసం తన ఆలోచనలు పక్కన పెట్టీ పెళ్లికి వప్పుకున్నాడు. పెళ్లి చాలా ఘనంగా చేశారు. మంచి ఇంటీరియర్ డే కరెట్ చెయ్యడంలో అద్భుతం అని చెప్పాలి.
సత్య శ్రీ పెళ్లి అయ్యి రమేష్ ఇంటికి సారేతో వచ్చింది. డాక్టర్ రమ్య పెళ్లి అయినా సరే ఉద్యోగం అదే ఊళ్ళో ఉండటం వల్ల భర్తను కూడా అదే ఊరు తెచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు. కొంత కాలం పుట్టింట్లో ఉండి వేరే ఇంటికి వెళ్లి పోయారు కానీ డాక్టర్ కావడం వల్ల ఆమెకి వంట మనిషి అవసరం ఉన్నది, వారికి దొరక లేదు. సత్య శ్రీ అన్నకి వదిన కూడా మనిషి చేత క్యారెజ్ పెట్టే ఒకదానిలో టిఫిన్ మరొక దానిలో లంచ్ హాట్ క్యారేజ్ లో పంపేది.
సత్య శ్రీ ఆ ఇంటికి ఈ ఇంటికి అన్ని కలిపి తెచ్చి చూసేది. రమేష్ భార్య పనితనం చూసి మురిసిపోయాడు. చెల్లెలి కోసం త్యాగం చేశానని బ్రమ పడ్డాడు కానీ రమ్యకి సత విధాల సత్య శ్రీ ఇంటి బాధ్యత చూసేది. కానీ అత్త ఇంట్లో ఏ ఒక్కరూ మెచ్చుకునే వారు కాదు.
రమ్య రమేష్ ల పెంకితనానికి ఒక్కో సారి బాధ పడేవాడు కానీ సత్య శ్రీ సర్దుకుపోయేది. కాల గమనంలో రమ్య పిల్లలను తన ఇద్దరు పిల్లలతో పాటు సత్య శ్రీ యే మంచి చెడులు చూస్తూ పెంచింది. సత్య శ్రీ నీ అందరూ మీకు నలుగురు పిల్లలా అనేవారు. అంతలా రమ్య పిల్లలు అత్ధతో కలిసిపోయేవారు.
ఎవరైనా సరే ఆశల సౌధలను అవకాశాన్ని బట్టి మార్చుకుంటే జీవితంలో ఆశల అందాలు సొంత మవుతాయి.
పెళ్ళిలో భజంత్రీలు మధ్య పిడికిిట తలంబ్రాలు పెళ్లి కూతురు అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల సారాంశం తెలిసి జీవిస్తే ఆడ పిల్ల ఆనందమే ఆ ఇంట సౌభాగ్యము.
రమేష్ నీ అంతా మీ భార్య చాలా బాగా కుటుంబం చూస్తుంది అని అనేవారు
ఒక్కో రోజు ఇంటికి వచ్చే టప్పటికి ఇల్లు స్వర్గంలా ఉండేది ఎంతో మెచ్చుకునేవారు. దానికి సత్య శ్రీ నవ్వుతూ మీరు నాకు అవకాశం ఇచ్చి ఇల్లు వదిలి పెట్టారు దాన్ని నేను సొంత భావాలతో తీర్చి దిద్ది పెట్టాను అనేది.
ఆడపిల్ల కోడలిగా అత్తింటి కి వస్తుంది ఆమెను కూతురు కన్న మిన్నగా చూస్తే ఆ ఇంట్లో సిరి సంపద పెరుగు తాయనిb తెలుసుకుని కోడల్ని ప్రేమగా చూడాలి అని రమేష్ తల్లి తో చాలా సార్లు చెప్పేవాడు. తన చెల్లెలు రమ్య పెంకితనంగా ఉండేది దానితో పోలిస్తే సత్య శ్రీ చాలా సౌమ్యూరాలు అని తెలుసుకున్నాడు అంతే కాదు పని మంతురాలు కూడా, అందుకే రమేష్ భార్యను ప్రేమగా చూసుకునేవాడు. ప్రతి భర్త ఇలా ఉంటే కుటుంబంలో సమస్యలు ఉండవు. అవును నిజమే కదా ఇంట్లో పెద్ద వాళ్ళు ఓపిక లేక పోయినా సరే మా కాలం లో అల చేశాను ఇలా చేశాను నువ్వు బాగా చెయ్యి లేదు నీకు రాదు ఊరికే హోమ్ సైన్స్ చదువు కున్నావ్ కానీ నీకు ఏమి రాదు పనిలో శ్రద్ద లేదు అంటూ విమర్శించ లేదు. అందుకే నేను నా ఆశలు ఆశయాలు అన్ని కలిపి ఇంటిని స్వర్గంలా దిద్దాను అన్నది.రమేష్ కూడా భార్యకు అవకాశం ఇచ్చాడు
రమేష్ తల్లి కోడల్ని కొత్తలో చాలా విమర్శలు కొడుకు దగ్గర చేసేది కానీ అమ్మ మీరు ఎరీ కోరి చేసుకున్నారు వంకలు పెట్ట వద్దు మనిషిని కలుపు కోవడం అలవాటు చేసుకోండి అని చెప్పాడు దానికి తల్లి కొప్పడింది కానీ రమేష్ విజ్ఞత కల వ్యక్తి ఇంటికి వచ్చిన పరాయి పిల్ల ఎన్ని ఆశలతో అత్తింటి అడుగు పెడుతుంది. అక్షంలు పెట్టీ విమర్శించి వేదించ వద్దు అని సర్ధి చెప్పాడు.
ఎవరూ ఎన్ని మాటలు అన్న భర్త ప్రేమ, మాట సహాయం ఉంటే భార్య అత్తింటి ఎన్ని సమస్య లైనా ఎదుర్కొని ఆశల సౌధం నిర్మించుకుని జీవిస్తుంది. ఆడ పిల్లను ఆనందంగా జీవించ నివ్వండి కుటుంబ వ్యవస్థను కాపాడే బాధ్యత ఇంటి యజ మానిపై ఉన్నది.
స్త్రీల మధ్య సఖ్యత లేక పోయినా భర్తగా భార్యను ప్రేమగా చూడాలి అప్పుడే ఆశలు సౌధాలు సొంత మవుతాయి భార్యభర్తల మధ్య గొడవలు పెట్టే వారు ఎంతో మంది కుటుంబ సభ్యులు వారి భుక్తి కోసం వెంపర్లాడటం చూస్తున్నాము. కూటి కోసం కోటి అబద్ధాలు అడి కుటుంబాలు సమస్యల మధ్య పెడుతున్నారు. విజ్ఞత తెలిసిన భర్త భార్యను ప్రేమగా చూసి నప్పుడు ఆశల అందాలు సొంతమవుతాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!