చనిపోతామని ముందే తెలియటం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఉదయప్రసాద్
ఏదోకనాడు ఆగిపోతుంది ఊపిరి
కానీ అది మరచిన మనసుకి అన్నిటిపై వాపిరి
మనిషి కాడు ఫ్రీ లాన్సర్
మరణం వాని జీవిత పుటలో చివరి ఆన్సర్
దురదృష్టవశాత్తూ ముందే తెలిస్తే ఆ క్షణం
భయంతో చిట్లిపోతుంది మెదడులోని ప్రతి కణం
మస్తిష్కాన్ని ఆక్రమించే ఆ యోచన
ఇంకా ముందస్తు మరణానికి సూచన
ఇక దారితప్పిన ధర్మాలు
అప్పటిదాకా చేసిన అరకొర క్రూర కర్మలు
తొలిచేస్తున్న తలపు చెవుల్లో ధ్వనిస్తుంటుంది
మృత్యు దేవత పిలుపు
అంతే పొరాడే గుండె బితుకు బితుకు
మంటూ క్షణ క్షణం చస్తూనే సాగిస్తుంది బతుకు
అవి నాలుగు నిముషాలే అయినా దుర్భరం
ఎవ్వడికుంటుంది అంత గుండె నిబ్బరం..!?