నా ఋణం తీర్చుకున్నానా? (సంక్రాంతి కథల పోటీ)

నా ఋణం తీర్చుకున్నానా?
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

చిరంజీవి కామేశం నెలరోజుల నుంచి అమ్మ పరిస్థితి ఏమి బాగులేదు నీ గురించే పలవరిస్తోంది ఒకసారి చూడాలని ఉంది వాట్సప్ చేసారా అని నిన్న కూడా అందిరా. ఈ రోజు మూసిన కన్ను తెలియకుండా పడుకుంది.
నా శిష్యుడు అదేరా నీకు స్నేహితుడు డాక్టర్ ప్రభాకరం రోజుకి రెండుసార్లు వచ్చి చూస్తున్నాడు. మాష్టారు అమ్మ కి ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయాయి హాస్పిటల్ లో ఉంచండి అంటే నేను అనాదిగా ఉంటున్న ఇంట్లో నే మావాడు వచ్చేదాకా ఉండి మాష్టారు దగ్గర ఉండగా వాడి చేతిలోనే పోతానురా ప్రభాకరం అంది
నీ దృష్టిలో నేను చందశాసనుడినే. కానీ అమ్మ ఒక్కగానొక్క కొడుకు మూటగట్టుకునిపోతామా చెప్పండి. మీకు నేను చెప్పేదాన్నికాను సరస్వతి అందరికి అబ్బదు మీరు వెయ్యిమంది విద్యార్థులున్న పాఠశాల కి హెడ్మాస్టర్ అని ప్రథమ శ్రేణిలో పాసయి బంగారు పతకం ఇంజనీరింగ్ లో సాధించిన నిన్ను పై చదువులకు తన నగలమ్మి పంపించినపుడు మీ అమ్మలో వీరనారి ఝాన్సీలక్ష్మిబాయి కనిపించింది .
నీ చదువుపూర్తయి అక్కడి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానంటేనే ఒప్పుకోకపోయున విశాలహృదయం తో నాతో జీవితం వాళ్ళది మనం మరో అరవై ఏళ్ళు బ్రతకం కదండి అని ఒప్పించి నీ వివాహాన్ని వైభవంగా మనదేశంలో ఎవరేమన్నా హైదరాబాద్ లో ఘనంగా జరిపించింది.
నేను కఠినంగా ఉండటానికి కారణం నీ బాగుకొరకే. ఎందుకంటే చదువుకునే వయస్సులో కాస్త తండ్రి కఠినంగా కనిపించినా పిల్లల తండ్రివైన నీకు చిన్నప్పుడు నాన్న గారు ఎందుకలా ఉన్నారో అర్ధమై ఉంటుంది.
నీకు టెన్త్ లో స్టేట్ ఫస్ట్, ఇంటర్ లో జిల్లాలో ,ఐఐటి మద్రాస్ లో సీట్ వచ్చినపుడు ఎక్కువ సంతోషం పడ్డది మేమేరా, మేము ఇప్పుడు పండిన పళ్ళలా ఉన్నాము నేడో, రేపోలా ఉంది అమ్మ పరిస్థితి అని నాన్నగారు ఫోను లో చేసి పెట్టిన వెంటనే నా భార్య ,పిల్లలిద్దరిని తీసుకుని కెనడా నుంచి ఇండియా కి వచ్చాను.
మా ఇంటి గుమ్మం ముందు జనం గుమిగూడి ఉన్నారు. సరిగ్గా సమయానికి హెడ్డుమాష్టార్ కొడుకు కుటుంబంతో సహా వచ్చారు అనడం వినిపించింది .ఇంట్లోకి వెళ్ళగానే నాన్నగారు వాలుకుర్చీలోకూర్చుని రమ్మని సైగ చేస్తే వెళ్ళి చెయ్యి పట్టుకుని పక్కనే మంచంపై పార్వతీదేవి పడుకుందా అన్నరీతిలో అమ్మ అచేతనంగా ఉంది. ప్రక్కన డాక్టర్ ప్రభాకరం ఉండి సమయానికి వచ్చావు అమ్మ ఇప్పుడే శ్రీరామచంద్రుని కడకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనగా ఆమె చేతిని తీసుకున్న వెంటనే పట్టుకుని కళ్ళుతెరచి వెంటనే మాకు ప్రభాకరం భార్య ఇచ్చిన తులసి తీర్థం వేయగా లోకాన్ని విడచి పరమాత్ముని దగ్గరకు వెళ్ళిపోయింది. నాన్న గారు వాలుకుర్చీ దగ్గరకు వెళ్ళి చెయ్యి పెట్టుకోగానే మెడ నా భుజం మీద వాల్చి అమ్మ దగ్గరకు వెళ్ళి పోయారని తెలిసిన క్షణాన కట్టలు తెంచుకున్న దుఃఖం చూసి జనం అదృష్ట వంతులు పార్వతీపరమేశ్వరుల్లా ఉన్న వృద్దదంపతులు కొడుకు చెంతనుండగా వైకుంఠ ఏకాదశి నాడే పోయారు అన్నమాట విన్నప్పుడు నేను నిజంగా తల్లి తండ్రులకు ఏమిచేశాను అన్నది అంతు చిక్కని ప్రశ్నయే…!!

…………………………

You May Also Like

One thought on “నా ఋణం తీర్చుకున్నానా? (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!