పండగొచ్చింది (సంక్రాంతి కథల పోటీ)

పండగొచ్చింది
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

“ఏమోయ్!ఇంకెంతసేపు తయారవుతావ్. ఈ పాటికి ఫ్లయిట్ వచ్చేసుంటుంది. మనమటు వాళ్ళిటు అవతాములాగుంది. వేగంగా రావోయ్!” పెళ్ళాన్ని తొందరపెడుతున్నాడు రఘురామయ్య.
“ఇదిగో వచ్చేస్తున్నా!ఒక్క నిముషం” భార్య సుశీల.
అమెరికానుండి కొడుకు శ్రీరామ్ , కోడలు శ్రీనిధి మనవడు మధుకర్, మనవరాలు మానస పండగకు వస్తున్నారు. వాళ్ళని విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుందామని బయలుదేరుతున్నారు. రాక రాక పండుగకు మూడు సంవత్సరాల తరువాత ఇండియా వస్తున్నారు. నిజంగా పండుగొచ్చింది వాళ్ళకి. వీరు తయారై వెళ్ళేటప్పటికి ఫ్లయిట్ వచ్చేసింది. విజిటర్సలాంజ్లో వెళ్ళి వాళ్ళరాకకై ఎదురు చూస్తున్నారు. రఘురామయ్య వెనుకనుండి వచ్చి కళ్ళుమూసాడు మనవడు మధుకర్, అమ్మమ్మ కళ్ళు మూసింది మానస. ఇద్దరూ ఒకేసారి “నేనెవరో చెప్పుకోండి తాతయ్యా,నాన్నమ్మా”అన్నారు. వాళ్ళచేతులు తడిమి “మధుకర్”అని తాతయ్యా, “మానస” అని నాన్నమ్మా అని ఒకేసారి అన్నారు. కొడుకు కొడలు కూడా వాళ్ళకాళ్ళకి నమస్కారాలుచేశారు. అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు.

………..

రఘురామయ్యగారు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి విశ్రాంతజీవితం గడుపుతున్నారు. ఒకే ఒక్క కొడుకుని ఉన్నతచదువులు చదివించారు. ఎంతో పద్దతిగా చదివించారు. విదేశంలో ఉద్యోగం చేస్తున్నా మనదేశసంస్క్రుతి సాంప్రదాయాలను గౌరవించేవిధంగా పెంచారు.శ్రీరామ్ కూడ అలాగే వాటిని అనుసరిస్తాడు. తన పిల్లలను కూడా అలాగే పెంచాడు. వాళ్ళకి ఇండియా రావాలంటే ఎంతో ఉత్సాహం చూపెడతారు.వాళ్ళింటికి వచ్చిన కోడలు కూడ మంచి సాంప్రదాయకుటుంబం నుండి రావడం వారి అదృష్టం. ఈ రోజుల్లో అక్కడక్కడా అరుదుగా ఇలాంటి కుటుంబాలుంటాయేమో.
తెలుగువారికి ముఖ్యమైన పండగ నాలుగురోజుల పండగ పెద్దలపండగగా సంక్రాంతి జరుపుకోవడం జరుగుతుంది.రఘురామయ్యగగారు తాను రిటైరైన గ్రామంలోనే స్థిరపడ్డారు. ఆ వాతావరణమంటే ఆయనకు ఎంతో ఇష్టం. కోడుకు తన దగ్గరకు వచ్ఛెయ్యమన్నా వెళ్ళకుండా ఇండియాలోనే ఉండిపోయారు. ప్రతిపండుగకు శ్రీరామ్ కుటుంబంతో రావడం అలవాటు చేసుకున్నాడు. కరోనా కారణంగా మూడేళ్ళ తరువాత ఇప్పుడు రావడం వాళ్ళకి చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. శ్రీరామ్ కే కాదు వాళ్ళ పిల్లలకి తాతయ్యా నాన్నమ్మల దగ్గరకు రావడమంటే చాలా ఇష్టం. తాతయ్య చెప్పె కబుర్లు ఊరిలో తిప్పి చెప్పెవిశేషాలు వాళ్ళకెంతో నచ్చుతాయి. అలాగే నాన్నమ్మ చేసే రకరకాల పిండివంటలన్నా వాళ్ళకెంతో ఇష్టం. ఇండియాకి వస్తే ఒ నెలరోజులపాటు గడిపి వెళతారు. ఆ నెలరోజులలో వాళ్ళు చూడాలనుకున్నవి చూస్తారు. వాళ్ళ బంధువులందరిని కలుస్తారు. మళ్ళీ వచ్చేవరకు అవన్నీ గుర్తుంచుకునేవిధంగా అనుభూతులను పంచుకుంటారు. పాశ్చాత్యవ్యామోహంలో పడకుండా ఈ రోజులలోకూడ మాతృదేశంపై ముఖ్యంగా తెలుగుతనాన్ని మరచి పోకుండా వుండడం చాలాగొప్ప విషయమే. అదంతా రఘురామయ్యగారి చలవే. శ్రీరామ్ కి పండగసందడి అంతా తెలిసిందే.అదే తన పిల్లలకి కూడా తెలిసేలా చేశాడు. పిల్లలకి పండుగకి ఇండియా రావడానికి ఇష్టపడతారు. గ్రామంలో ఇంటింటిముందు పెట్టెగొబ్బెమ్మలు, ముగ్గులు వేయడం గంగిరెద్దులు, హరిదాసుకీర్తనలు అన్ని ఎంతో శ్రద్దగా గమనించి వాటిగురించి తాతయ్యని అడిగి తెలుసుకుంటారు. నెలరోజుల అనుభూతులను మూటగొట్టుకొని వెళతారు. వెళ్ళేటప్పుడు అందరూ నిరాశగా వెళతారు. మరిన్నిరోజులుంటే బాగున్నని అనుకుంటారు. కాని వెళ్ళక తప్పదు. వెళ్ళాల్సిందే. మళ్ళీ పండుగవచ్చేవరకు ఆగాల్సిందే ననుకుని అమెరికా వెళతారు. పండగంటే అంతేగా!

**********

You May Also Like

One thought on “పండగొచ్చింది (సంక్రాంతి కథల పోటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!