కష్టాల కొలిమిలోకి తెచ్చుకోకు చావు

కష్టాల కొలిమిలోకి తెచ్చుకోకు చావు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కందర్ప మూర్తి

కష్టాల కొలిమిలోకి తెచ్చుకోకు చావు
మతం మతం అంటూ మదోన్మాదంతో
మానవత్వం మరిచి మారణ హోమం సృష్టించి
అమాయక జనుల ప్రాణాలను హరించి
కడకు ఆ హోమంలో పడి మాడి మసై పోతావు
కు‌లం కు‌లం అంటూ కులాల మద్య చిచ్చు పెట్టి
కాల యముడిలా కేకలేసి కాలచక్ర
నాగు కోరల కాటుకు గిలగిల కొట్టుకుని కట్టెలా
వల్లకాటిలో కాలి మసై పోతావు కడకు
నాది నాది అంటూ స్వార్దంతో పరుల సొమ్ము
పీల్చి పీల్చి కోట్లకు కోట్లు కూడ పెడతావు
కాలచక్ర గమనంలో నలిగి కాటిలో కట్టెల
మద్య మాడి బూడిదై మిగులుతావు చివరకు
స్నేహమనే ఛత్రఛాయలో సహకారమనే
సహచరుల చల్లని నీడలో పరోపకారమనే
అక్షయ పాత్రలో చిరస్థాయిగా నిలుస్తావు
తనువు చాలించినా తరిగిపోదు
నీ యశస్సు తరతరాల వరకు
ధర్మంలో దానగుణం
మాధవసేవలో మానవత్వం
ఆత్మలో పరమాత్మ
నీతో మిగిలి ఉండేది నీ ఆత్మే
ఇది తెలిసి మసులుకో జీవా
మనిషిగా పుట్టినాక చావు తప్పదని తెలుసుకో
మర్మ మెరిగి మసులుకో
మనసును పదిల పర్చుకో మానవా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!