హరివిల్లు

హరివిల్లు

రచన: సంజన కృతజ్ఞ

నా చెక్కిలి పై జారిన కన్నీటి చుక్కను
నీ ఓదార్పు కాంతి రేఖ తాకిందంటే
మనసు ఇంద్రధనస్సులా
ఆకాశంలో విహంగమవుతుంది చూడు

రంగురంగుల ఇంద్రధనుస్సు
వలె అక్షరాలను అద్దాలి
హరివిల్లులా కాగితంపై
ప్రతి భావం వికసించాలి

ఆకాశపు  సీమలో
అందాల పాలవెల్లి
ఎవరు వేశారది
ఆనంతాన రంగవల్లి
వారెవ్వా ఇంద్రధనుస్సు
ప్రసరించెనులే రంగులఉషస్సు

రంగులు
ఆకాశానికి
ఇంద్ర భవనపు
హంగులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!