జాస్మిన్

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

జాస్మిన్

రచయిత :: రాధ ఓడూరి

భయం ఎప్పుడైనా ఎలాగైనా పుడుతుంది. ఇది మనస్సులో జరిగే సంఘర్షణ. హారర్ సినిమాలు చూస్తే భయం.అయినా ఆ భయాన్ని కథలా చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఆ భయాన్ని నిజంగానే చవిచూస్తే…..

****

“అరేయ్! ఇప్పటికే టైం పదిన్నరైంది”.

ఈ రాత్రికి ఇక్కడ ఉండాలంటే నాకు భయంరా!” అని చెప్పు అప్పుడు నమ్ముతాను” నవ్వుతూ అన్నాడు శశి తన ఫ్రెండ్ ధీరజ్ ని ఏడిపించడానికి.

కారు డోర్ తెలుస్తూనే ధీరజ్ శశి అన్నదానికి ధీటుగా సమాధానమిచ్చాడు “అమ్మో! అసలే ఈరోజు పౌర్ణమి. ఈ పున్నమి వెలుతురులో కూడా ఆత్మలు వేలాడుతుంటాయని ఎక్కడో చదివారా!. అందుకే ఎక్కడ ఈ ఫౌమ్ హౌస్ లో కనిపిస్తాయేమో అని వెడుతున్నాను..బై బై” అంటూ గట్టిగా నవ్వుతూ తన కారుని ఇంటి దారి పట్టించాడు.

శశి…ధీరజ్ వెళ్లిపోగానే గేట్ దగ్గరగా వేసి ఇంట్లోకి నడిచాడు.

****

శశి, ధీరజ్ చిన్ననాటి స్నేహితులు. స్కూల్,కాలేజీ చివరికి ఉద్యోగం కూడా ఒకే ఆఫీసు. ధీరజ్ కి కొత్తగా పెళైంది. శశికి మాత్రం చిన్నప్పటి నుండి ఒక కల. మంచి ఉద్యోగం, కారు, ఇల్లు, ఫాం హౌస్ ఉండాలని. తర్వాతే పెళ్ళి చేసుకోవాలనుకుని స్థలం తీసికొని ఈ ఫాం హౌస్ కట్టించుకున్నాడు.

మెుదటి రోజు తన ప్రాణ స్నేహితుడు మరియు చిన్ననాటి స్నేహితుడైన ధీరజ్ తో గడపాలనుకున్నాడు. కానీ ధీరజ్ భార్య వినత ఒక్కతే ఇంట్లో ఉంటుందని, భయపడుతుందని ఇంటికి బయలుదేరాడు.

***

వెన్నెల్లో మెరిసిపోతున్న తన ఫాం హౌస్ ని చూస్తూ ఆనందంగా తన్మయత్వం తో కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ముక్కు పుటాలను తాకుతూ మైమరపించే సువాసనకి తన్మయుడై మెల్లగా కళ్ళు తెరిచి చూసాడు.

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవబోయాడు.

కానీ..అప్పటికే తనను ఆక్రమించించుకున్న అందమైన అమ్మాయి భయంకరంగా నోరు తెరిచి శశి మెడను గట్టిగా కొరికింది.

శశి కి ఊపిరి ఆడటం లేదు. ఆ ఆడ ఆకారం శశి గుండెలపై చేతులు వేసి నొక్కుతోంది.

అప్పుడే శశి కి పక్కనే చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుతూ ఎగురుతోంది ఇంకొక అమ్మాయి…ఆ పిల్ల ఎగురుతుంటే కాళ్ళకున్న గజ్జెల మోతకి శశి చెవుల నుంచి రక్తం ధారగా కారుతోంది.

చెవుల వెంట చల్లగా తగిలేసరికి శశి తన బలాన్నంతా కూడదీసుకుని రెండు చేతులతో తనని ఆక్రమించించుకున్న ఆ ఆకారాన్ని బలంగా ఒక్క ఉదుటున వెనక్కి తోసి ఒక్కసారిగా లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసాడు.

ఆశ్చర్యం… ఇందాకటి ఆకారం లేదు. గజ్జెలు కట్టుకొని ఎగురిన అమ్మాయి కోసం తల పక్కకి తిప్పి చూసాడు. అక్కడ కూడా ఆ అమ్మాయి లేదు.

ఆశ్చర్యంగా అరుగు మీద నుంచి లేచి చుట్టూ చూసాడు.
అంతా ప్రశాంతంగా ఉంది.
‘అంటే! ఇది కలనా! అమ్మో! నిజం అనుకొని భయపడ్డాను…’ అనుకుంటూ తిరిగి అరుగు మీద కూర్చున్నాడు.

ఇంతలో….
మెడ దగ్గర చల్లగా తగిలేసరికి చేతితో తడిమి చూసుకున్నాడు.

చేతికి అంటినది చూసుకుని అదిరిపడి వేగంగా ఇంట్లోకి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు.

మెడ మీద పంటి గాట్ల గాయం…ఆ గాయం తాలూకు ఛాయలు కొద్ది నిమిషాల ముందు చేసినట్లే ఉంది.

ముందుగా ఆ గాయాన్ని కడిగి..తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెరిచి కట్టు కట్టుకున్నాడు.

సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని కలలో జరిగిన సన్నివేశాలని మెల్లగా గుర్తుకు తెచ్చుకుని…. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ” యస్! యస్! జాస్మిన్… జాస్మిన్” అంటూ చప్పట్లు కొడుతూ…ఇక చాలు పద వెళ్దాం అంది” ఆ గజ్జెలు కట్టుకొని ఉన్న అమ్మాయి.

“జాస్మిన్” ఈ పేరు ఎక్కడో విన్నాను…. ఎక్కడ.. ఎక్కడ!?’
‘ఆ గుర్తుకు వచ్చింది’.

‘ఈ ఫాం హౌస్ కి స్ధలం కొనేముందు ఈ స్ధలం లో ఒక తాత ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో “జాస్మిన్” అనే పేరు చాలా సార్లు వినిపించింది’.

‘ఎవరీ జాస్మిన్!? అసలు ఎవరు ఆ ఇద్దరు అమ్మాయిలు!?. రేపు తాతని కలసి ఈ విషయం అడగాలి. ముందుగా ఈ ధీరజ్ కి జరిగిన విషయం చెప్పాలి…’ అనుకుంటూ ధీరజ్ కి ఫోన్ చేసాడు.

“హలో! శశి! నిద్రంతా పాడు చేసావు కదరా! సరెలే ఎందుకు ఫోన్ చేసావు!?” విసుగ్గానే అడిగాడు ధీరజ్.

“ధీరజ్! కాస్త ఓపిగ్గా వినరా! నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోను!? ” అంటూ జరిగినదంతా చెప్పాడు శశి.

శశి చెప్పిన విషయం విని ధీరజ్ కి ఉన్న నిద్ర దిగిపోయింది.
వెంటనే…
“శశి! ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు భయపడకు” అంటూ ఫోన్ పెట్టేసాడు ధీరజ్.

ఆగమేఘాలపై శశి ఫాం హౌస్ కి కారు లో బయలుదేరాడు ధీరజ్.
అప్పటికి సమయం రాత్రి మూడు గంటలు.

***

ధీరజ్ రాక కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి అరుగు మీద కూర్చుని ఆకాశం వైపు చూడసాగాడు.
ఇంతలో ముక్కు పుటాలను తాకుతూ మైమరపించే సువాసనకి తన్మయుడై మెల్లగా తల తిప్పి పక్కన చూసాడు.

మల్లె చెట్టు… చెట్టు నిండా మల్లె పూలతో పండు వెన్నెలతో పోటీ పడుతోంది.
‘ఇంతకుముందు ఈ చెట్టు ఉందా!? ఉండే ఉంటుంది. అంత కంగారులో నేను చూసి ఉండను..’ అనుకుంటూ
మల్లె చెట్టు ని సుతారంగా తడిమాడు.

అంతే… క్షణం లో మల్లె చెట్టు, పూలు నల్లగా అయిపోయాయి.
శశి భయంతో ఒక్క సారిగా లేచి బయట గేటు వైపు పరిగెట్టాడు.

కానీ తలకు ఏదో తగిలేసరికి కింద పడ్డాడు.
ఏది తగిలిందానని పైకి చూసేసరికి అక్కడి దృశ్యం…
ఆకాశం లో దాదాపుగా ముప్పై శవాలు తల క్రిందులుగా వేలాడుతున్నాయి… అంతే అది చూసేసరికి శశి కళ్ళు బైర్లు కమ్మాయి.

***

“శశీ!లేరా కళ్ళు తెరువు.. నేను ధీరజ్ ని అంటూ కుదిపేసరికి…
శశి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఎక్కడ ఉన్నానని చూసుకున్నాడు…మంచం మీద ఉన్నాని గ్రహించి లేచి కూర్చున్నాడు.
“ధీరజ్! నేను ఎలా వచ్చారా మంచం మీదకి”
“శశీ! నేను వచ్చేసరికి నువ్వు ఫాం హౌస్ గేటు దగ్గర పడి ఉన్నావు. మెల్లగా నిన్ను నా భుజం పై మోసుకుని ఇదిగో ఈ మంచం పై పడేసారా”
శశి కి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా మంచం మీద నుంచి లేచి” అరేయ్! టైం ఎంతైంది!?”
“ఆరున్నరైందిరా!”
“పద త్వరగా ఇక్కడ ఉన్న తాతని కలుద్దాం” అంటూ ధీరజ్ చేయి పట్టుకొని తన కారులో కూర్చోబెట్టి కారుని తాత ఇంటి వైపు పోనిచ్చాడు.
“శశీ! కారు కాస్త మెల్లగా నడపరా”
“మూసుకుని కూర్చో… నువ్వు నీ నోట మాట వెధవాని వెధవ!” అన్నాడు కోపంగా శశి.
“నేనేం చేసారా?”
“అన్నావు కదా! వెన్నెల్లో శవాలు వేలాడతాయని”
“ఏదో సరదాగా అన్నాను… అంటే… అంటే… నీకు..”అంటూ గట్టిగా నవ్వాడు.
ఇంతలో సడెన్ బ్రేక్…
“అరేయ్! దిగు”
“తాత ఇల్లు వచ్చింది దిగు”
“అలా చెప్పు” అంటూ ఇద్దరూ కారు దిగారు.
తాత పొలం దగ్గర కూర్చున్నాడు.
“తాత”
తాత మెల్లగా తల తిప్పి వారి వైపు ఏమిటన్నట్టు చూసాడు.
“తాత! జాస్మిన్ ఎవరు!?”
“ఎందుకని అడుగుతున్నారు”
ఇక లాభం లేదని శశి తాత దగ్గర కూర్చుని జరిగిందంతా చెప్పాడు.
తాత చిన్నగా నిట్టూరుస్తూ…”బాబూ! నువ్వు ఉండే స్థలం ఒకప్పుడు ముప్పై ఇల్లు ఉండే చిన్న గ్రామం. నలుగురు అన్నదమ్ములు కలిసి వారి పొలం దగ్గర చిన్న గ్రామం ఏర్పాటు చేసుకుని ఉండేవారు.వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు”
“అది చలికాలం…ఒక రాత్రి అందరూ నిద్రిస్తుండగా చలికి కాచుకునే పొయ్యి నిప్పు రవ్వలు గుడిసెల మీద పడి అందరూ చనిపోయారు”.
“కానీ జాస్మిన్ అనే అమ్మాయి అప్పుడే బయటకు వచ్చింది…తన తాత తెచ్చిన మల్లె చెట్లు చూసుకోవడానికి… అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను”.
“గుడిసెలు కాలిపోతుంటే…అందరూ గావు కేకలు పెట్టారు.. అందులో రాణి అనే అమ్మాయి ఇంకా పూర్తిగా కాలిపోలేదు…ఆ పిల్లని కాపాడాలని జాస్మిన్ లోపలికి వెళ్ళింది…. రాణి రావద్దన్నా. కానీ అప్పటికే జరగాల్సిన ఘేరం జరిగిపోయింది…ఆ మంటల్లో జాస్మిన్ కూడా చనిపోయింది బాబూ”.
“మరి ఈ స్ధలం ఎవరి ఆధీనంలోకి వెళ్ళింది!? మాకు ఎలా అమ్మారు!?”
“ఆ నలుగురి అన్నదమ్ములో చిన్న మనవడు హైదరాబాద్ లో ఉంటాడు. నానా కష్టాలు పడీ స్ధలం తన పేరు మీద రాయించుకుని నన్ను అమ్మమన్నాడు.
నేను మీకు అమ్మాను బాబూ!”
“మరి నువ్వు జాస్మిన్ తో ఎలా మాట్లాడుతున్నావు తాతా!?”
” నేను కూడా వాళ్ళ పొలం లో పని చేసేవాడిని. జాస్మిన్, రాణీలకి నేనంటే ఇష్టం. నాకు మాత్రమే కనిపిస్తారు”
“మరి మా వెంట ఎందుకు పడుతున్నారు!?”
“నువ్వు ఫాం హౌస్ కట్టేటప్పుడు మల్లె చెట్లు తీసేసావు కదా! ఆ పిల్లకి అవంటే చాలా ఇష్టం”
“అర్ధం అయ్యింది తాత. ఇక నుంచి నా ఫాం హౌస్ లో మల్లె చెట్లు పెంచు అంతేకాదు నేను లేనప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే…ఈ రోజే వచ్చేయ్ పనిలోకి…ఇక మేము వెళ్దాం” అంటూ శశి.. ధీరజ్ తో కారుని ఫాం హౌస్ వైపు పోనిచ్చాడు.

శశి, ధీరజ్ గేటు తీసుకుని ఫాం హౌస్ లోపలికి ప్రవేశించగానే చుట్టూ మల్లె చెట్లు… ఇంతలో చల్లని గాలి వారిని తాకుతూ పొగలా మారి అదృశ్యమైంది.

***సమాప్తం***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!