ప్రాణత్యాగం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

ప్రాణత్యాగం

రచయిత :: సుజాత

అది ఒక పెద్ద బంగ్లా అందులో ఎవరు ఉండరు. అంత పాడైపోయింది.జాగీర్దార్లు పటేళ్లు ఉండేవారు ఒకప్పుడు. అది ఇప్పుడు అంతా శిధిలమైపోయింది. కాలేజీ పిల్లలు ఎక్స్ పరిమెంట్ చెయడం కోసం ఈ బంగ్లాలో దిగారు.ఆ ఊరు మనుషులు వింతగా చూస్తున్నారు.వీళ్లని ఈ బంగ్లాలో ఏమి పని అన్నట్టుగా చోద్యం చుసినట్టుగా వింతగా చూస్తున్నారు.

దీనిని భూత్ బంగ్లా అని పిలుస్తారు.చీకటి పడితే అటు చాయలకే ఎవరు పోరు అది ఒకప్పుడు కళకళలాడుతుండేది
ఆ బంగ్లాలో దాదాపుగా 50 మందికి పైగా ఉండేవారు ఇప్పుడు దీని రూపురేఖలు మారిపోయినవి. ఇప్పుడు అందులో దయ్యాలు తిరుగుతున్నాయి.అని ఇక్కడి
వాళ్ళ నమ్మకం ఈ కాలంలో కూడా దయ్యాలు ఉంటాయ అని ఇది అంతా ట్రాష్ అని కొట్టి పడేశారు సుమన్ ఈ పక్కకు క్లీన్ చెసుకుందాము సరే రా అజిత్ ప్రణీత్ అందరం ప్రేష్ అయి వద్దాము కాస్త రిలాక్స్ గా ఉంటుంది ….పదండి అంటూ అందరు వెళ్ళారు.

అక్కడ అంతా చెత్తచెత్తగా ఉంది క్లీన్ చేసి టాయిలెట్స్ తయారు చెసుకున్నారు.ఇంటినుండి తెచ్చుకున్నవి తిని రిలాక్స్ అయ్యారు. చీకటి పడింది. టైమ్ కూడ తెలియడం లేదు.పడుకుందామని దుప్పటి పరుచుకొని పడుకున్నారు.ఇక్కడ ఏదో వింత వింత శబ్దాలు గుడ్లగూబ అరుపులకు అందులో దోమలు ఇంకా నిద్ర పట్టడం లేదు ముసుగు దన్ని పడుకున్న నిద్రపట్టక చస్తున్నాను అరేయ్ విజయ్ భయం వేస్తుంది. నిద్ర పడుతలేదురా….అరేయ్ గట్టిగా కళ్ళుమూసుకుని పడుకొ అదే పడుతుంది. అరేయ్ అలా కాదురా నే చెప్పేది విను… అరేయ్ పడుకొర నన్ను డిస్ట్రబ్ చేయకు చిరాకుగా అన్నాడు ….శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటు పడుకొ అన్నాడు.

మనసులో భయం పోవడం లేదు నల్లటి ముసుగు మనిషి అటుగా వెళ్తున్నాడు.అమ్మో దయ్యం దెయ్యమంటూ అరుస్తున్నాడు.ఎంటిరా నీ గొడవ మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు ఇంత పిరికి వాడివైతే ఎలారా అన్నాడు నీకు ఈ బంగ్లా చూస్తే అలా అనిపిస్తుంది.కొత్తకదా అలాగే ఉంటుంది. రెండు రోజులు పొతే అంతా సర్థుకుంటుంది అన్నారు .అది కాదురా ఒకసారి వెళ్ళి చూద్దాం మిగితా ఫ్రెండ్స్ ఎలాగో అలా పడుకున్నారు.నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు.
బెచ్చలు ఊడి వచ్చిన స్లాప్పై నుండి సూర్యకిరణాలు మొహంపై పడడంతో తెలివికి వచ్చారు.

తొందరగా తయారు కండి మనం ఊరుబైటకి వెళ్దాము
సరే పదండి అంటు అందరు బయటకు వచ్చారు. కెమరాలు పట్టుకుని వెళ్ళారు.ఒక ముసలాయన అటుగా వస్తూ అయ్యా మీది ఏ ఊరు ఎందుకు వచ్చారు అని తాత అడిగాడు. మేము ఒకే కాలేజీలో చదువుకుంటాం మేం స్నేహితులం ఊరు చూడ్డానికి వచ్చాము అని సమాధాన మిచ్చాడు.అవునా బాబు అని అన్నాడు అవును “తాత “ఈ బంగ్లా గురించి మీకు ఏమైనా తెలుసా? అని అడిగాడు అంతే తమ వంక ఎగాదిగా కింద నుంచి పై దాకా చూశాడు. అది మాత్రం అడుగకు అన్నాడు…. ఏమిటో అర్థం కాలేదు సరే బాబు నేను వస్తాను అంటూ వెళ్లాడు.

అలా ఎందుకు అన్నాడో అర్ధం కాలేదు సరే కానీ అనుకుంటూ సరదా సరదాగా తిరిగి కావలసిన ఎక్స్పరిమెంట్ తీసుకుని హోటల్లో తిని మళ్లీ బంగ్లాకు వచ్చారు..లోపలికి వెళ్ళగానే వాళ్ల సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి.ఇదంతా ఎవరు చేసుంటారు అని భయం వేసింది గోడల పైన రక్తంతో మిమ్మల్ని చంపేస్తాం ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఉంది అందరికీ ఒక్కసారిగా భయం వేసింది.ఇది ఎవరి పనైఉంటుంది అనే ఆలోచనలో పడ్డారు.మనుషుల పన లేక నిజంగానే దయ్యమా అని భయం వేసింది.

అరేయ్ మనం ఇంటికి పోదాం రా నాకు చాలా భయం వేస్తోంది ఎక్స్ పరిమెంట్ వద్దు ఏం వద్దు అన్నాడు అజయ్ అలా భయపడితే ఎలా రా మనం ఏదో ఒకటి తేల్చుకుని పోదాం ఈరోజు కాకపోతే రేపు తెలుసుకుందాం నిద్రపోవద్దు నిద్రపోతున్నట్టు నటిస్తాం అదేంటో కనిపెడదాం అని అందరు అనుకున్నారు. అక్కడ అంతా చూడడం మొదలు పెట్టారు.అన్ని రూములకు పెద్ద పెద్ద తాళం కప్పలు ఉన్నవి అవి పూర్వకాలం తాళాలు మెల్లిమెల్లిగా ఇంకో రూమ్ దగ్గరికి వెళ్లారు. అక్కడ మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిది ఎక్కడ ఉంది చెప్పు అంటూ బెదిరిస్తున్నాడు
ఆ ముసుగు మనిషి.నాకు తెలియదు అంటున్నాడు దెబ్బలుతిన్న అతను…. బాధగా నూతిలో నుండి వస్తున్నట్టుగ ఉంది ఆ గొంతు….. నీకు తెలుసు చెప్పు నాకు తెలిసినా చెప్పను అని మొండికేస్తున్నాడు….నన్ను చంపండి నన్ను చంపండి అని గావు కేకలు పెడుతున్నాడు. అయినా వినడం లేదు చితక బాదుతున్నాడు మెల్లిగా ఆ కిటికీలోంచి చూస్తున్నారు.

ఒక ముసుగు మనిషి కొరడాతో కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు అని అర్థం కావడం లేదు . వీళ్లిద్దరికీ సంబంధమేంటి అని ఆలోచనలో పడ్డారు
అరేయ్ అనడంతో ముసుగు మనిషి వీళ్ల మాటలు విని
ఎవరు అక్కడ అంటూ కంగారుగా బయటకు వచ్చాడు .
దిక్కులు చూస్తూ ఎవరైనా వచ్చారా అనుకుంటూ… కాని అక్కడ ఎవరు లేరు పిల్లి మ్యావ్ అన్న శబ్దం విని మల్లి లోపలికి వెళ్లి పోయాడు.హమ్మయ్య అనుకోని ఒక పక్కగా దాక్కున్నారు.మళ్లీ రేపు వస్తాను నీ పని అప్పుడు చెప్తా అంటూ వెళ్లాడు. వీళ్లకి ముచ్చెమటలు పట్టేసినాయ్ కంగారుగా కనబడకుండా దాక్కున్నారు ఆ ముసుగు మనిషి అటూ ఇటూ చూస్తూ తాళం వేసి
వెళ్లి పోయాడు.హమ్మయ్య అనుకున్నారు మెల్లిగా కిటికీలోంచి చూశాడు ఆ మనిషికి చినిగిన గుడ్డలు మాసిన గడ్డంతో ఉన్నాడు.

చూట్టు చెత్తచెత్తగా ఉంది ఒక అల్యూమినియం పల్లేంలో అన్నం ఉంది.తాత అంటూ పిలిచారు. ఎవరు అన్నట్టుగా చూశాడు మేం తాత నిన్ను కాపాడడానికి వచ్చామన్నారు మావైపు వింతగా చూశాడు నన్ను కాపాడతారంటూ వింతగా అవును తాత ఒక నవ్వు నవ్వాడు నిజం తాత మమ్మల్ని నమ్ము అని అన్నారు చుట్టూ చూశారు తాళం పగుళకొట్టడానికి ఏమైనా ఉన్నదా అని చూశారు అక్కడ ఒకటి రాడ్ కనబడింది దాంతో పగలగొట్టడానికి ట్రై చేస్తున్నారు కొట్టగా.కొట్టగా తాళం పగిలింది.అక్కడ ఒక చిన్న దీపం ఉన్నది.ఆ తాతను మెల్లగా బయటకు తీసుకువచ్చారు
ఏంటి తాత ఇక్కడెందుకున్నావు నీవు ఎవరు నిన్నెందుకు బంధించారు.చెప్పు .ముందు వాటర్ తాగి.అన్ని వివరంగా. చేప్పు అంటూ వాటర్.బాటిల్ తోటి నీళ్లు తాగించారు.

ఇప్పుడు చెప్పు తాతన్నారు.ఆ తాత ఇలా చెప్పుకొంచిండు అది ఒక చరిత్ర నాయనా నాకు ఎనభై సంవత్సరాలు ఉంటాయి.ఈ బంగ్లాలో నేను గుమాస్తాని ఈ బంగ్లా మనుషులు పెద్ద జాగీర్దార్లు నేను నమ్మిన బంటును వీళ్లకి ….చేదోడువాదోడుగా ఉండేవాడిని. వాళ్లని వీళ్లే దుర్మార్గంగా ఆస్తి కోసం చంపేశారు వీళ్లకి వారసుడున్నాడు. పోతూపోతూ ఆస్తుల వివరాలను బాబు ని నాకు అప్పజెప్పారు వీళ్ల పాలివాళ్లు నన్ను ఆస్తి వివరాలు చెప్పమని నన్ను వేధిస్తున్నారు.వీళ్లు చాలా దుర్మార్గులు నాయన ఈ ఇంటి వారసుడున్నాడు బాబుని ఎక్కడ చప్పుతిరోనని భయంగా ఉంది ఇ విషయం నాకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్పుకు వచ్చాడు ఈ ఊరులో ఎవరికి తెలియదా తెలిస్తే ఏం లాభం బాబు అందర్నీ చంపేస్తాడు ఊరంతా గజగజ వనుకుతారు. ఇప్పుడు మాతో రా ఊరి ప్రజలముందు అంత చెప్పేసెయ్ అన్నారు.

అలాగే! నాయనా…తాతను బయటకు తీసుకొచ్చి శుభ్రంగా గడ్డం తీసి చక్కగా తయారు చేసారు. తెల్లవార్లు అతనికి కాపలాగా ఉండి రచ్చ బండ దగ్గర తీసుకొచ్చారు అందరూ వింతగా చూశారు తనవైపు ఎవరు అన్నట్టుగా జరిగిన విషయాలన్నీ ఊరి ప్రజల ముందు చెప్పిండు ఇంకేముంది అతన్ని పట్టించి ఆ మనిషిని ఊరు ప్రజల ముందు ఊరి.బహిష్కరణ చేసారు.

కాలేజీ పిల్లలు హితబోధ చేశారు దెయ్యాలంటూ ఏవీ నమ్మకూడదు ఇవన్ని.మూఢనమ్మకాలు అసలు ఎప్పుడు.నమ్మకూడదు అని చెప్పి ఆ ఇంటి వారసున్ని తీసుకువచ్చి ఆస్తులను ఆస్తుల వివరాలను అన్ని అప్పజెప్పి ఆ బాబును ఆ ఊరి ప్రజలకు పరిచయం చేసాడు ఆ తాతను బాబు కృతజ్ఞతతో ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు తాతను దెయ్యాలంటూ ఆ బంగ్లా వైపు మీరు ఎప్పుడు చూడలేదు అలా చూసినట్టయితే ఇలాంటి ఘోరాలు జరిగివుండేవికావు అని ఆ పిల్లలు సర్దిచెప్పారు. ఆ ఊరి ప్రజలు పిల్లలను ఎంతో చక్కగా మెచ్చుకున్నారు.వాళ్ళకు సహకరించి వాళ్ళనుకున్న పనికి సహాయం చేశారు.మీరు ఆ బంగ్లాలో దయ్యం ఉన్నదంటూ వెలివేశారు.ఇప్పుడు అవి ఏమి లేవు అందరూ సంతోషంగా ఉండండి అంటూ చెప్పి వెళ్లిపోయారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!