కరోనా కట్టడికై చిరు ప్రయత్నం

కరోనా కట్టడికై చిరు ప్రయత్నం

రచయిత :: బొడ్డు హారిక

 

మా స్నేహితురాలి వాళ్ళ అమ్మ గారిది మా వీధి చివర చిన్న అంగడి, అక్కడ చిన్నపిల్లలు తినే చిరు తిండ్ల దగ్గర నుంచి పప్పులు ఉప్పులు అన్ని కొద్దికొద్దిగా అమ్ముతుంటారు.

కరోనా కారణంగా బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి లేని సమయంలో వీధి చివర ఉన్న అంగడి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది,

మా వీధిలో ఉన్న పెద్దవాళ్ళందరికి అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోనిదే రోజు గడవదాయే, ఇక పిల్లలయితే వానర సైన్యానికి సాటిరారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా ని ఆపడం కష్టమే కదా మరి.

ఇదంతా చూసి నాకు నా స్నేహితురాలు లక్ష్మి కి ఒక ఉపాయం తట్టింది, ఇంతకు అదేమిటంటారా మన అంటే నా స్నేహితురాలు లక్ష్మి వాళ్ళు అమ్మ గారి అంగడి గుర్తుకొచ్చింది.
అంగడి కి వచ్చు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని, అంగడి బయట సానిటైజర్ డబ్బా ఒకటి పెడితే వచ్చిన అందరూ సానిటైజ్ చేసుకుంటేనే సరుకులు ఇస్తాం అని వాళ్ళ అమ్మ గారు తో మాట్లాడాము, మొదట వాళ్ళ అమ్మ గారు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులని వివరించిన తరువాత ఒప్పుకున్నారు.

అప్పటి నుంచి అంగడి కి వచ్చు ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవడం, సానిటైజ్ చేసుకోవడం అలావాటైంది,
ఇంటి దగ్గర కూడా మాట్లాడాలంటే మాస్క్ పెట్టుకొని దూరం పాటిస్తూ ఉంటున్నారు. మనం ఏమైనా మొదలు పెట్టాలి అంటే చిన్న విషయం నుంచే కదా మొదలుపెడతాం , అందుకని మన వీధి చివర ఉన్న అంగడ్లు దగ్గర నుంచి ‌మొదలు పెడితే తరువాత అది బజారు లో ఉన్న అండులకు అలవాటవుతుంది కదా, ఏదైనా ఒక్క అడుగు తోనే కదా మొదలవును అదే నేను నా స్నేహితురాలు వాళ్ళు అమ్మ గారు తో పాటు వేయించిన అడుగు…

ఇప్పుడు మా వీధి, మా పేట సురక్షితంగా ఉంది, ఇలా ఉండడం వలన ఇక్కడ ఉన్న వారు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కూడా రక్షించినట్లే కదా , ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచన తో అడుగేస్తే మన దేశం మొత్తం కరోనా కట్టడికై ప్రయత్నం చేసినట్లే కదా…..!

అందుకే మనం జాగ్రత్తలు పాటిస్తూ, మన చుట్టూ ఉన్న సమాజం కూడా పాటించేలా చేస్తే, మన దేశం మొత్తం కరోనా ని కాలితో తన్నేయవచ్చు కదా….!

***

 

You May Also Like

2 thoughts on “కరోనా కట్టడికై చిరు ప్రయత్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!