మనసు పొరలు

“మనసు పొరలు”

రచన: తాడూరి సుమతి

ఎంత దగ్గరి బంధమైన, మనసుకి ఎంత చేరువైన, ఒకరి మనసు పొరల్లో, ఒదిగిన్న ఆలోచలను, మరొక మనిషి, మనసు తో పంచుకోలేదు, అది ఏ బంధమైన సరే, మనసు పరి పరి విధాలా ఆలోచిస్తుంది, ఒక్కోసారి మన మనసు, మన మాటే వినదు, మనసుకి నచ్చిన దారి వైపు వెళ్ళే వరకూ ఊరుకోదు అనుకుంటూ, జేబులో ఉన్న సెల్ ని తీశాడు.
సాగర్.. ఒకసారి సంగీత కీ ఫోన్ చేయనా! ఫోన్ చేసిన మాట్లాడుతుందో లేదో, నేను సంగీత మూడు సంవత్సరాలనుండి, ప్రేమించుకుంటున్నాము, కానీ ఇంతవరకు తన మనసు పూర్తిగా నాకు అర్ధం కావటం లేదు, నన్ను ప్రేమిస్తున్న, నేను లేకపోతే ఉండలేను అంటుంది, కానీ తన బాధ, సంతోషాన్ని మాత్రం నాతో పంచుకోదు,తను ఎందుకిలా చేస్తుంది.. అనుకుంటూ సంగీతకి ఫోన్ చేశాడు సాగర్.
రెండు రింగుల తర్వాత ఫోన్ ఎత్తింది సంగీత.. “హలో సంగీత, ఏమైనది నీకు, వారం రోజుల నుండి కలవటం లేదు, ఫోన్ చేయటం లేదు, చెప్పు సంగీత” అని సాగర్ అనగానే,
“హ, సాగర్ నేను రేపు కలుస్తాను. గోల్కొండ కోటకి రా!” అని పెట్టేసింది సంగీత.
“హలో, హలో సంగీత” పెట్టేసింది, తన మాటే వినాలి కానీ నా మాట తను వినదు, అనుకుంటూ నిద్ర పోయాడు సాగర్.
తెల్లవారింది…..
సాగర్ తొందరగా లేచి, రెడీ అయి గోల్కొండ కోటకు వచ్చాడు, సంగీత తన కన్న ముందే వచ్చింది.
ఇద్దరూ హాయ్ చెప్పుకున్నారు.
“ఏమైనది సంగీత, ఇన్ని రోజులు ఎటు పోయావు, నీ కోసం నేను పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నాను”.
“ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్, అందుకే కలవలేక పోయాను”.
“ఏంటవి, నీ బాధ నాకు చెప్పొచ్చు కదా! నాకు వీలైన సహాయం చేస్తాను కదా!” అన్నాడు సాగర్.
“లేదు సాగర్, నా కష్టాలు నీకు చెప్పి, నిన్ను బాధ పెట్టలేను. పెట్టడం నాకు ఇష్టం లేదు”అని సంగీత అనగానే,
“అలా అంటావేంటి సంగీత, మన ఇద్దరి మనసులు కలిసాయి, త్వరలో ఇద్దరం పెళ్లి కూడా చేసుకుంటున్నాము. నీ బాధ, సంతోషం, కష్టం, సుఖం, అన్ని నాతో పంచుకోవాలి, అయినా.. కష్టాలు లేని మనిషి, బాధ లేని మనసు ఉండదు సంగీత. బంధానికి, అనుబంధానికి సంబంధం ఉన్నట్టే, బాధకి సంతోషానికి బంధం ఉంటుంది. మనసు పొరల్లో దాగివున్న కష్టాన్ని, బాధని వేరొకరితో పంచుకుంటే, బాధ తీరి మనసు తేలిక పడుతుంది” అని సాగర్ అనగానే,
“ఏమి లేదు, నాన్నకి కొంచెము ఆరోగ్యం బాలేక, హాస్పిటల్ కి తిరిగాము, అందుకే నిన్ను కలవలేక పోయాను అంతే. సారీ సాగర్ ఇక నుంచి ప్రతి విషయం నీతో పంచుకుంటాను” అంది సంగీత.
ప్రేమతో సంగీతను హగ్ చేసుకున్నాడు సాగర్..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!