మనసు

మనసు

అంశం :నిన్ను దాటిపోగలనా

నవమాసాలు మోసీకన్నాను
నిన్నే నా ప్రాణంగా చూసాను
నీ అడుగులు తడబడుతుంటే
నా చేయి అందించి నీకు తోడైనాను
నీ జ్ఞాపకాలను మరువక ముందే
నా అవసరం లేదన్నావు కాని
నను వీడి నీవు ఉండగలవేమో
కాని  నిన్ను వీడి నే వెళ్లిపోగలనా
నీవు తిననంటే నిన్ను విడువలేదు
చందమామను చూపించి గోరుముద్దలు
తినిపించాను నీవు నన్ను మరిచినా
చీ అన్నా నా బిడ్డే కదా అని సరిపెట్టుకున్న.
నిన్ను వీడి నేను దూరంగా వెళ్లలేను
నీచిలిపి మాటలతో మురిపించావు
నీ కొంటెపనులతో నన్ను విసిగించావు
కాని నేను ప్రేమతో మరిపించాను
అయినా నా అవసరం లేదన్నావు
అయినా నీపై ఇసుమంతైనా కోపంలేదు
మా ప్రేమకు రూపాలు మీరే
మా నీడను దాటి పోగలరా
మీరు కాదన్ననాడు మేము కాటికే
ప్రేమబలమైనది ప్రేమను దాటి పోగలమా

రచయిత :: సుజాత.కోకిల

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!