మావ నీ ఎనాకమాలే..నేను

మావ నీ ఎనాకమాలే..నేను
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాజ్(తొర్లపాటి రాజు)

మావ…మావ.. ఓ మావ ఏముంది మావ ఆ ఫోన్ లో అల చూస్కొని ఉందిపోతండవ్! కూసింత పక్కనెట్టి బువ్వ తిందుగాని రా మావ
ఒలే అచ్చి(అచ్చియమ్మ) నువు బడికి పోతున్నప్పుడు నీ ఎనకమాలే తిరిగేటోడ్ని యాదుంద అచ్చి! పో మావ మరీను అదెలా మరిసిపోతాను (అంది సిగ్గుపడుతూ) అయినా ఆ ఇషయం యెందుకు మావ ఇప్పుడు?
ఏం లేదే అచ్చి .. ఈ మధ్య మనోహరం అనే.. పోన్ లో కవితలు, కథలు చదువుకునే  పత్రిక వచ్చింది లే అది చూస్తున్న అచ్చి.. అందులో.. ఈ రోజు నీ ఎనకే అని ఒక కథ ఇచ్చాడే అది సూస్తాంటే నీ ఎనక నేను పడ్డ కదే అది గురుతుకొచ్చిందే. అవునే అచ్చి నీ ఎనాకే పడ్డ కదా..దానికోసమే నటే ఇందులో కూడా ఉంటాది (అని సిగ్గుపడుతూ మావ.. మావ.. నీకు మాంచి జోరు మీద ఉంది బుర్ర ఏంది కథ!మావ నీ వెనకే అంటే , నాకు నువ్వు ఎప్పుడూ అండగా నా వెనుకే..అలాగే నీకు నేను నీ వెనుకే అని. ఇదొక్కటే కాదు మావ..మనం పుడతామ హమ్మయ బయటకి వచ్చేశాం రా బాబు అనుకొనే లోపే…మన వెనుకనే చిన్నతనం వచ్చేస్తాది. పోన్లే ఇదేదో బాగుంది కదా హాయిగా ఆడుకోవచ్చు..పాడుకోవచ్చు..మనం ఏం కావాలన్నా మన ముందుకు వచ్చేస్తాయి. ఇస్కూల్ కెళ్ళటం ..కోతి కొమ్మచ్చి తొక్కుడు బిళ్ళ..ఉయ్యాల ఆటలు..బోలెడు.ఎంతో హాయిగా..ఉంది కదా అని అనుకొనే లోపే మళ్లీ ఎనకమాలే వయసు వచ్చేసింది..మా మావ లాగా. బడికి ఎళ్తుంటే ఎనకమాలే వచ్చిన మావ నా వయసుతో పాటే ఎనకాలే వచ్చేశాడు( నవ్వుతూ).ఇంక మావ నీకు తెలియంది ఏముంది మావ ఆ వయసు పెట్టే బాధలు..వలుపు పడే ఆపసోపాలు అబ్బబా..సెప్తుంటే ఇప్పుడు కూడా చూడు చెమటలు యెట్ట పట్టేతున్నయో. అవునా అచ్చి…ఎక్కడే ఏది ఏది సూపించుమావ…నీకు మాంచి పొత్రంగ ఉందే ఇయ్యా ముందు సెప్పింది ఇను మావ. ఇలా ఏదో మన తంటాలు మనం పడతన్నమా..ఇంతలోనే ఎనకమాలే పెళ్లి వయసు వచ్చేసింది గందా. మావ..నీకు గుర్తుందా మన పెళ్ళి రోజు తర్వాత..అబ్బ..అబ్బ..ఆ సిగ్గు సూడు సేసిందంత సేసి ఏమ్ ఎరగనోడిల కానీ మావ ఆ రోజు నువ్వు సేసినవ్ సూడు అబ్బ…
ఆహా..ఇప్పటికీ మరిసిపోలేను మావ ఏమ్ సేశినవ్ మావ నువ్వు! అచ్చి … అట్ట సెప్పమాకే మా సెడ్డ సిగ్గు అయితాంది(మెలికలు తిరిగిపోతూ).
ఏంది సిగ్గు దేనికీ నేను ఏం సెప్తాన్న నువ్వు ఏంటి అనుకుంటున్నావు..ఆ రోజు రాత్రి …(మావ :ఆ ఆ రోజు రాత్రి చేతులు ఓ నలిపేసుకుంటూ) ఏంది మావ నీ యవ్వారం. ఆ రోజు రాత్రి మనం పడుకొనే గదిని చాలా అందంగా చూడ ముచ్చటగా తయారు చేసినవ్ అంటున్న.. (మావ: ఒ దానికేనా..ఇన్ని ఒంపులు తిరిగి సెప్తండవ్ సాల్లే నీ సంబడం)
సర్లే గానీ మావ…ఇలా పెళ్లి అయ్యాక ఇంకేముంది పిల్లలు బాధ్యతలు సంపాదన పిల్లల భవిష్యత్ ఆల్ల కోసం మనం పడే పాట్లు అలా ఏదో ఒక మూసలో పోతుంది గదా అనుకుంటే … ఎనకమాలే ముసలి తనం వచ్చేద్ది మావ అప్పుడు సూడు మన కట్టాలు నడుం నెగనివ్వదు..కాళ్ళు కదలనీయవు.. కళ్ళు సరిగా కనబడవు అబ్బో..సెప్పలేము లే అదే మంచి సమయం అనుకొని పిల్లలు కూడా మనల్ని మనకే వదిలేసి వాళ్ళ బిజీ లేని పనుల్లో గజిబిజీ గా ఉంటారు. ఏదో మనవలుతో..ఓపిక సేసుకొని గడుపుతుంటే నేనున్న నీ వెనకే అని..మన చావు సిద్ధంగా ఉంటది మావ… ఇదే నీ వెనుక నా వెనుక…ఉండేది! అచ్చి ఏమ్ సెప్పినవే జీవితం అంటే..ఇంతే కదే.అంటే మనం పుట్టినప్పుడే మన వెనుకే చావు కూడా పుడతాది అన్నమాట! మావ పెళ్లి అయిన దినం సంది ఎప్పుడు నీ ఎనకమాలే నడిసిన.. కానీ మావ ఈ ఒక్క సావు ఇశయం లో మాత్రం..నీ ముందు నడుత్త మావ .. నువ్వు నా ఎనకె ఉన్నవన్న ధైర్యం ఉంటాది మావ…కళ్ళ నీళ్ళు తుడ్చుకుంటు చెప్పింది అచ్చి! అచ్చి నన్ను వదిలి నువ్వు ముందు పోతావా అప్పుడు నా ఎనకా ఎవరుంటారే? మావ…సాల్లే నాకు తెల్దేటి..ఆ గుడి పక్కన ఆప్పయ్యమ్మ లేదేటి..నాకు తెలదనుకున్నవ నీ భాగోతం..పద పద… పనిలో కి ఈ మనోహరం ఓల్లకి..కథలు..కవితలు.. అంట తపస్సు చేయడం తప్ప యే పని పాటు ఉండదు ఏదో ఒకటి ఇస్తా ఉంటరు. మనకెవడు పెడతాడు కూడు పద నేను వచ్చేస్తున్నా పద.. పద నా ముద్దుల మావవి కదా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!