ముందస్తు పిలుపు

ముందస్తు పిలుపు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శిరీష వింజరపు

ముందస్తు ఆహ్వనం అందుకోగ మరణం
తన కౌగిట ఒదిగుండనా
ఈ దినం పుట్టుక నీకెరుకలేదు
గిట్టుట తెలియుట ఓ వరమే

భవబంధాల దారాన్ని దాటెల్లగా
మూటముల్లె సర్థి స్వాగతించరా
నీ బాధ్యత బందీలు చక్కబెట్టుకోగా
పాతబట్ట విడిచి కొత్త బట్ట ధరియింప

ఏకాకిగా వస్తావు ఏకాకై పోతావు
ఎన్నటికైన చేరేదే ఒలుకులమిట్ట
కబురు పంపి చేరుతుంది అంతేరా
ముందస్తు భేరిమోగే అప్పగింతలన్ని చేయు

ముందు తెలిసి మృత్యువు
మిత్రుడాయే చిత్రంగా
చేయవలసిన మంచి ఏదో
చేసి పోవోయ్ ఇక అంతేనా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!