అంటరానితనం – ఆనాటి భారత ముఖచిత్రం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అరుణ డేనియల్
భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్
పదునాలుగు సంతానంలో చివరివాడిగా
జననం
అట్టడుగు మహర్ వర్గానికి
చెందినవాడు కావడం వల్ల
అంటరానితనాన్ని అనుభవించిన
జీవితం
దుర్భరమైన చిన్నతనం
పాఠశాల లో దూరంగా
ఉంచిన సంఘటన
ముంబాయి లో విద్యాభ్యాసం
ఎవరెన్ని అన్నా ముందుకు సాగి
బి.ఎ.పట్టా అందుకున్న పట్టుదల
ప్రతిభ తో బరోడా రాజు నుంచి
స్కాలర్షిప్ పొంది అమెరికా పయనమయి
ఈరోజు కు కూడా మామూలు మనిషికి
అందుబాటులోలేని కొలంబియా యూనివర్సిటీ
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నంత
విద్యాభ్యాసం ఉన్నత వ్యక్తిత్వం
సంపాదించి తిరిగి స్వదేశానికి వచ్చిన గాని
అట్టడుగు వర్గాలకు ఏదో చెయ్యాలని తపన
తరువాత రోజుల్లో లేబర్ పార్టీ స్థాపన
అంటరానితనం కులాల వేర్పాటు పై రచన
ఎవరు శూద్రులు అని ప్రశ్నించిన బాబా సాహెబ్
కొనసాగిన అంబేద్కర్ హవా
మహాత్మాతో పనిచేస్తూనే
ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫేడరేషన్
స్థాపన
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత
మొదటి కార్మిక శాఖ మంత్రిగా
పదవి స్వీకారం
రాజ్యాంగ రచన కమిటీ కి
చైర్మన్ గా ఉదయించే సూర్యుడు
మన అంబేద్కర్
అంటారితనం నుంచి అందలమెక్కినాగాని
మారని వ్యక్తిత్వం
అట్టడుగు వర్గాల వారిని
పైకి తేవాలని తపన
అంటరాని తనం
తుడిచి వేయాలని
జీవితం అంకితం చేసిన
మార్గదర్శి
మన బాబాసాహెబ్