ముందుకెళ్దాం

ముందుకెళ్దాం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కొల్లూరు వెంకటరమణమూర్తి 

అవసరార్ధులను ఆదుకొంటూ
ఇరుగుపొరుగులకు సహకరిస్తూ
ఆనందాన్ని పొందేజాతి మనది!

మాట, చేత, సమయం, సమస్తాన్ని
మార్చేసుకున్నాం వ్యాపారధోరణిలో
సంతోషపడుతున్నాం దోపిడీచేసుకొని!

మారాలి మన ఆలోచనా పద్ధతులు
వెళ్ళాలి పూర్వ సంస్కృతికి ఇకనైనా
పునరుద్ధరించాలి భరతజాతి వైభవాన్ని!

అనుసరించాలి అంతరాత్మ ప్రబోధాన్ని
చూడగలగాలి తోటివానిలో దైవాన్ని
విస్మరించరాదెన్నడూ నైతికధర్మాన్ని!

ఎవరో మహానుభావుడు పుట్టుకొస్తాడు
ఉద్ధరిస్తాడు మనందరిని అనుకొనేకంటే
మనకి మనంగా మారి ముందుకెళ్దాం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!