పల్లెల్లో సంక్రాంతి సంబరాలు

పల్లెల్లో సంక్రాంతి సంబరాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దేవి గాయత్రి

పాడి పశువులు పంట పొలాతో
పరవశిస్తూన్నాయి పల్లెసీమలు
పూదోటలు ప్రకృతి అందాలు
మన పల్లెలోనే వెల్లివిరిసేను సంక్రాంతి సంబరాలు

గంగిరెద్దుల గారడీలు
హరిదాసుల భజన గీతాలు
ముగ్గుల్లో గొబ్బెమ్మలు
సజ్జానిండా పిండి వంటలు

ఇంటినిండా చుట్టాల సందడులు
మనసు నిండా ఆనందాలు
ఆడపిల్లలతో అనుబంధాలు
ఇంటి అల్లుళ్ల ఆడంబరాలు
గాది నిండా కొత్త ధాన్యపురాసులు
చలితో చల్లారిన కోపతాపాలు

పసుపు గడపలు పచ్చని లోగిళ్ళు తో
కనువిందు చేస్తాయి మన పల్లెటూర్లు
పచ్చిక బైళ్లు పొంగిపొరలే సెలయేర్లు
పుణ్యం చేసుకుంటేనే పుడతాము పల్లెల్లో
పండుగ రోజులు పరవశించే తీపి గురుతులు

పూర్వపు మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు
పంచుకున్న భావాలు పెంచుకున్న బంధాలు
పారిజాత వృక్షాలు పర్వతశ్రేణులు
హృదయానంద పరిచే ఉద్యానవనాలు
పల్లెలతో మన అనుబంధాలు
తనివితీరని తరంగాలు

ప్రొద్దున్నే వినిపించే సుప్రభాత గీతాలు
సుందరమైన దృశ్యాలు
పల్లెటూల్లే కదా మనకు ప్రేరేపణలు
పంట పొలాలపై ముసురుకున్న తుమ్మెదలు
కనువిందు చేస్తూ కనిపిస్తాయి మన పల్లెల్లో

ప్రేమను పంచే పల్లెవాసులు
ప్రగతిలో ముందుంటారు
పగలు రాత్రి శ్రమ చేసే కష్టజీవులు
దేశానికి వెన్నెముక రైతన్నలు
పల్లె వాసులు మనసున్న మనుషులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!