నఖాంతం

నఖాంతం

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

      ‘గోదావరి ఎక్స్ప్రెస్ ‘విశాఖపట్నం నుండి  సరిగ్గా ఐదున్నర గంటలకు బయలుదేరింది, రైల్ అంత నిండు గర్భిణిలా, బరువుగా మెల్లగా ముందుకు సాగింది, విపరీతమైన రద్దీతో భోగి ల నిండా జనం తమతమ సీట్లలో లగేజీ లు సర్దుకుంటూ, రేపు’ హైదరాబాద్ ‘చేరాక చేయబోయే పనుల గురించి ఆలోచిస్తూ, గోల గోల గా మాట్లాడుకుంటూ ,నెమ్మదిగా సర్దుకుంటూ కూర్చున్నారు.  రైలు కాస్త స్పీడ్ అందుకోవడంతో ప్రయాణికులు కాస్త సెటిల్ అయినట్లు భావిస్తూ, కొత్త పరిచయాలు చేసుకుంటూ, ఎవరికి వారు తమ తమ కుటుంబాలతో మాట్లాడుకుంటూ, ఉండగా’ కాఫీ టీ కాఫీ’! అంటూ వచ్చే క్యాటరింగ్ కుర్రాళ్ళు హడావిడిగా తిరుగుతూ ఎంతో కోలాహలంగా ఉన్నాయి రైలు బోగీలు.
అలా 9 అయ్యేసరికల్లా రాజమండ్రి దగ్గర  అందరూ తమ వెంట తెచ్చుకున్న ‘టిఫిన్ బాక్స్ ‘ని ఓపెన్ చేసి తమ కుటుంబ సభ్యులకు ప్లేట్లలో పెట్టి  అందిస్తున్న సమయంలో, ఒక అమోఘమైన సువాసనలు భోగి ల నుండి  వెలువడుతున్నాయి, అవి ఏమిటంటే! ఒకరు తెచ్చిన పులిహార ,మరొకరు తెచ్చిన పూరి చపాతీ ,అలాగే దద్ధోజనం, మరొక రు చక్కగా మసాలాతో వండిన ,,,’చికెన్ బిర్యాని’ ఇలా కలగలుపు ఘుమ,ఘుమ లతో అన్ని భోగీలు నుంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. అలాగే పిల్లల కేరింతలు, భార్యల సాధింపులు, భర్తల రుసరుసలు, అంతా ఒక వింత ప్రపంచం లా రైలు ప్రయాణం సాగుతుంది.
అలా రాత్రి 10:00 కల్లా అందరూ తమ తమ రిజర్వేషన్ బెర్త్ లు సర్దుకుని తమ సెల్ ఫోన్లు చూసుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
అంతలో” s-9 భోగి ‘లో నుంచి పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ఏడుపులు వినబడగానే ప్రయాణికులు ఎంతో కలవరంతో ‘ఏమైంది రా, దేవుడా!!’ అంటూ, అనుకున్నంత లోపలే’ S-9 కోచ్’ లోని నలుగురు ఆడవాళ్లు, మరో ఇద్దరు మగ వాళ్ళు  అటూ ఇటూ పరిగెడుతూ, తమ ‘మెడమీద చిన్నపాటి రక్కేసినట్లున్న గాయం ‘మీద  చేతులు అదుముకుంటూ “అమ్మో నా గొలుసు పోయిం ది,”! అంటూ ఏడుస్తూ ,తమ ‘బంగారు గొలుసులు పోయినందుకు ‘బాధపడుతూ భోగి అంతా  వెతకసాగారు, అలా ఆ రాత్రి  వారికి కాళరాత్రి అయింది, ఎంత వెతికినా బంగారు గొలుసులు కనబడక ,మెడ మీద చిన్న గాయంతో ఏడుస్తూ గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ చైన్ లాగి రైల్ ని ఆపారు.
దగ్గర్లో ఉన్న ,’ఏలూరు స్టేషన్ ఆర్ RPF’ వాళ్లు వచ్చి ఎంత చెక్ చేసిన, ఎలాంటి ఆధారాలు దొరకలేదు ‘ ఫస్ట్ ఎయిడ్’ వాళ్ళని పిలిచి బాధితులను పరీక్ష చేయించి, బ్యాండేజీ లు కట్టి వెళ్లిపోయారు. అలా ఆ సీజన్లో నాలుగైదు సార్లు ఇదే రకంగా ‘ఏపీ ఎక్స్ప్రెస్ ‘లోని ‘కోణార్క్ ఎక్స్ప్రెస్ ‘లోని దొంగతనాలు జరిగాయి, అన్ని దొంగతనాలు ఒకే రకంగా ఉంటూ ముఖ్యంగా ఆడవాళ్ళ మెడమీద గాయాల చేసి, బంగారు గొలుసులు దొంగలించు పోవడం పరిపాటి అయిపోయింది.
ఎంతకీ అంతుపట్టని ఈ గొలుసు దొంగతనాలు, ప్రయాణికుల అభద్రత, దృష్టిలో పెట్టుకొని అత్యున్నత’ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ‘అప్పచెప్పారు, వీరిలో ఆరి తేరిన పోలీస్ అధికారి’ శ్రీ ప్రభాకర్ గారు.’
ఆయన కూడా తన డిపార్ట్మెంట్లో ఎంతో చర్చించి క్షుణ్ణంగా పరిశీలించి, “ఈ కేసులో ప్రయాణికుల మెడ మీద ఉన్న గాయాలు బట్టి ,పోనీ అది ఒక జంతువు చేస్తుందా! అనుకున్నా దానికి బంగారం తో పని లేదు, కావున ఇది మనుషుల పనే, ఎంతో చాకచక్యంగా దొంగతనం చేసి గాయపరిచిన మరుక్షణంలో మాయమవుతు, యదేచ్ఛగా మన అందరిలోనూ తిరుగుతున్నారు, అంటూ ప్రభాకర్ గారి చెప్తున్న తీరు, అక్కడున్న పోలీసు బృందం ఎంతో శ్రద్ధగా వింటూ ఎలా, ఈ కేసుని పరిష్కరించాలి? అని ఆలోచన చేస్తున్నారు.
‘ పోలీసు చీఫ్ డిటెక్టివ్ ప్రభాకర్ గారు’ ప్రయాణికుల మెడ మీద ఆయిన గాయాల నుండి కొన్ని శాంపిల్స్ తీసి, ‘ఫోర్స్ నెక్ డిపార్ట్మెంట్ కి పంపించారు, అలా నాలుగు రోజులయ్యాక ‘ ఫోర్స్ నెక్ డిపార్ట్మెంట్’ నుంచి కాల్ వచ్చింది, ప్రభాకర్ గారి తో మాట్లాడుతూ” సార్, ఈ మధ్య జరిగిన వరుస దొంగతనాలు, ప్రయాణికులకు గాయాలు ,అన్ని ఒకే మాదిరిగా ఉన్నాయి,” కానీ ఎక్కడో ఒక ఆవిడ మెడలో దొంగ రక్కేసిన ప్రదేశంలో ఒక చిన్నపాటి ‘వేలి గోరు ముక్క ‘, అది ఎనలైజ్ చేస్తే ,మనుషుల దేనని తేలింది, కనుక ఇది ‘జంతువు ద్వారా జరిగినది కాదని ‘మనుషుల వల్ల జరిగినది అని నిర్ధారించారు! అని చెప్పగానే ప్రభాకర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి తగిన సూచనలు ఇచ్చి  జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలలో గస్తీ పెంచారు.
ఆరోజు కూడా’ ఎన్ఏడి జంక్షన్ ‘దగ్గర ఉన్న ఒక బ్యాంకులో’ డ్వాక్రా రుణాలు’ కోసం ఎంతోమంది మహిళలు ప్రభుత్వ  రుణాల కోసం బారులు తీరి ఉండడంతో బ్యాంకు కిక్కిరిసిపోయింది ,అదే సమయంలో  ఒక్కసారిగా అలజడి రేగింది, “అమ్మో !!నా గొలుసు కొట్టేశారు,” అంటూ అరుస్తూ, ఏడుస్తూ కనీసం ఐదారుగురు ఆడవాళ్ళ మెడల్లో నుంచి గొలుసులు పోయాయి, ఆ ప్రదేశంలో చిన్న చిన్న గాయాలు అవ్వడం, ఒక్కసారిగా ‘బ్యాంకు సెక్యూరిటీ’ మొత్తం మూసివేసి చెక్ చేసి నా కూడా ఎలాంటి క్లూ దొరకక మళ్ళీ’ ప్రభాకర్ గారి పోలీసు బృందానికి ‘ఫోన్ చేసి రప్పించారు.
ఈసారి  ప్రభాకర్ గారు తన బృందంతో హుటాహుటిన వచ్చి’ బ్యాంకు’ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పోలీస్ ‘జాగిలాల ‘సాయం తో దొంగలు ఏ దిశగా వెళ్ళారో! అని పరిశీలిస్తున్న సమయంలో ‘2 పోలీస్ కుక్కలు ‘వేగంగా పరిగెత్తుతూ ‘ఎన్ఏడి జంక్షన్ నుంచి గాజువాక ‘వైపు వెళ్లి ,అక్కడే ఉన్న ఒక మురికివాడల లో తిరుగుతు కనీసం 200 పూరిపాకలు ఉన్న ప్రదేశం లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రభాకర్ గారి పోలీసు బృందం అన్ని విధాల ఆ పూరి గుడిసెల లో తిరుగుతూ ఏమీ తెలియక నిలబడి పోయారు. ప్రభాకర్ గారు ఒక నలుగురు కానిస్టేబుల్స్ ని పిలిచి “మీరు నాలుగు రోజులపాటు రాత్రి పగలు గస్తీ కాయండి, ఎలాంటి అనుమానం ఉన్న నాకు వెంటనే ఫోన్ చేయండి !”అంటూ తన బుర్ర గోక్కుంటూ అసహనంగా వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ దగ్గర పడ్డది, ఒకపక్క స్టేట్ గవర్నమెంట్, మరోపక్క  ‘హోమ్ మినిస్టర్’ దేశమంతా మన పోలీసుల పరువు పోతుంది, ఎలాగైనా ఆ దొంగతనాలు చేస్తున్న వారిని పట్టుకోండి! ఇప్పటికే మన పోలీసు వ్యవస్థ మీద న్యూస్ పేపర్లు దుమ్మెత్తి పోస్తున్నాయి, కనుక ఇది దేశ భద్రతకు మంచిది కాదు, అంటూ ఫోన్లు వస్తుండే సరికి పోలీస్ చీఫ్ ప్రభాకర్ రావు గారికి కి ఎంతో అవమానం అనిపిస్తున్నది. అందుకే పట్టుదలతో రాత్రి పగలు అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇలాంటి అలజడి రాకూడదు! అన్న ధ్యేయంతో పని చేస్తున్నారు..
ఆ రోజు’ ఆదివారం వైజాగ్ ఆర్కే బీచ్ లో ‘ఒక పెద్ద ‘ఎగ్జిబిషన్ ‘పెట్టారు జనాలు తండోపతండాలుగా వస్తు ఒక ఒకవైపు సముద్రపు అలలతో ఆడుకుంటూ, మరోవైపు ఎగ్జిబిషన్లో ఉన్న ‘జెయింట్ వీల్ ‘తదితర ఆట వస్తువుల తో పిల్లలను ఆడిస్తూ ,ఎంతో సందడిగా ఉంది, అన్నిచోట్ల పోలీసు బందోబస్తు బాగానే చేశారు ప్రభాకర్ గారు, తను కూడా ఆ సాయంత్రం అంతా పరికిస్తూ తన జీప్ లో కూర్చుని వేడి కాఫీ తాగుతూ పోలీసులకు సూచనలు ఇస్తూ, కాలం గడపసాగారు. సరిగ్గా ఎనిమిది గంటలకల్లా మళ్లీ జనంలో’ అరుపులు పెడబొబ్బలు, ఏడుపులు, వినిపించేసరికి, పోలీసు బృందాలు హుటాహుటిన ఆ జనసమ్మర్థం లోకి వెళ్లి తనిఖీలు చేశారు,అక్కడ కూడా కొందరి మహిళల బంగారు.గొలుసులు పోవడం మెడ మీద గాయాలు కావడం చూసి దొంగలు దొరక్క  ఎక్కడా ప్రయోజనం లేక జనాలందరూ వెళ్ళిపోయే వరకు ఉండి, తన డ్యూటీ ముగించుకొని ,”ఎవరు, ఆ వింత దొంగలు? ఇంత బందోబస్తు ఉన్నా దొరక్కుండా పోతున్నారు”  అంటూ తల బద్దలు కొట్టుకుంటూ ప్రభాకర్ గారు ఆలోచిస్తూనే ఉన్నారు.
ఆ రాత్రి  ప్రభాకర్ గారికి ఇన్ని దొంగతనాలు జరుగుతున్న దొరకని దొంగల, గురించి ఆలోచిస్తూ” ఛీ ,ఛీ వెధవ బ్రతుకు! రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్న నాకు ఈ దురదృష్టం ఏమిటో ?అర్థం కాక ఆ రాత్రంతా నిద్రపోలేదు, సరిగ్గా రాత్రి రెండు గంటలకు ఎవరికీ తెలియ కుండా మఫ్టీలో ఇద్దరు పోలీసులను’ గాజువాక మురికివాడల ‘ప్రదేశం లో ఉంచిన ప్రభాకర్ గారికి కి ఒక ఫోన్ వచ్చింది ,వాళ్ళు ఫోన్ చేసి ” సార్, ఇక్కడ ఒక గుడిసెలో నలుగురు మనుషులు ఈరోజు జరిగిన” ఆర్కే బీచ్ సంఘటన” గురించి గొడవ పడుతున్నారు, నా ఉద్దేశ ప్రకారం ఈ నలుగురు ఒక’ దొంగల గ్యాంగ్’ అని అనుమానంగా ఉంది, మీరు వెంటనే పోలీసు బృందం తో వచ్చి, ఈ పరిసరాలని ఘెరావు చేయాలి! అని చెప్పగానే ప్రభాకర్ గారు ‘గాజువాక పోలీస్ స్టేషన్ ‘కు ఫోన్ చేసి  బృందంతో సహా వారు చెప్పిన ప్రదేశంలో వెళ్లాలని ఆదేశించారు,. తను కూడా బయలుదేరి వెళ్లారు.
ఆ మురికివాడల ప్రదేశమంతా అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి గొడవా చేయొద్దు! అని చెప్పి ,మఫ్టీలో ఉన్న పోలీసులు చెప్పిన ఇంటి దగ్గర నాలుగు వైపులా పహారా పెట్టి, ఒక్కసారిగా తన’ రివాల్వర్ తో’ తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూసేసరికి ,ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు పోలీసులు ,ఎందుకంటే అక్కడ ఉన్న” నలుగురు “మూడుఅడుగులు ఉన్న మరుగుజ్జులు” “వారి మధ్యలో బంగారం గొలుసులతో నిండిన చిన్న చిన్న సంచులు, నగదు చూసి అందర్నీ నీ పట్టుకుని బేడీలు వేసి అందరూ చూస్తుండగానే పోలీస్ జీపుల్లో ఎక్కించుకుని ‘పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి’ బయల్దేరారు ప్రభాకర్ గారు.
ఆ మర్నాడు ‘పోలీస్ చీఫ్ ప్రభాకర్’ గారు’ ప్రెస్ మీట్’ పెట్టించి , లైవ్ టీవీ లో మాట్లాడుతూ “మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు నిఘ వేస్తూ ఈ నలుగురు ‘మరుగుజ్జు దొంగలను ‘, పట్టుకున్నాము, వీరివల్ల మన రాష్ట్రంలో ఎంతో అలజడి రేగింది, వీళ్లు ప్రజల బంగారు నగలను, దొంగతనం చేస్తూ ,వారి మెడమీద చిన్నపాటి గాయాలు చేస్తూ, అదే ఏదో ఒక ‘జంతువు చేస్తుందని భ్రమింప చేస్తూ,’ పలు రైళ్ల లోనూ, రద్దీగా ఉన్న ప్రదేశాలు బ్యాంకుల దగ్గర ,ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, ఎక్కడైతే జనసమ్మర్ధం ఎక్కువగా ఉందొ వారు పారిపోవడానికి సమయం ఉంటుందో, అక్కడే  ఎంతో చాకచక్యంగా అనేక మందిని గాయపరిచి, బంగారు నగలు కొట్టివేసి, ఈ రోజు మాకు ‘గాజువాక మురికివాడల’ ప్రదేశంలో’ రెడ్ హ్యాండెడ్ గా ‘, పట్టుబడ్డారు! అని చెప్పగానే, అన్ని వార్తా పత్రికల కెమెరాలు ఫ్లాష్ లు ‘లైవ్ టీవీ లో కవరేజ్ ఇచ్చాయి,’ మళ్లీ ప్రభాకర్ గారు మాట్లాడుతూ అందరికన్నా పెద్దవాడైన దొంగ ఈ ‘మరుగుజ్జు రంగయ్య’ వాడే మీ ముందుకు వచ్చి మాట్లాడుతాడు! అని మైకుఇచ్చారు పోలీసులు, “అయ్యా నేను నా కుటుంబం అంతా మూడు అడుగులు కూడా లేని’ మరుగుజ్జుల ము, ‘మేము ఈ సమాజంలో బతకలేక ,ఆత్మహత్య కూడా పాల్ పడ్డాము, అది కూడా కుదరక ,ముష్టి అడుగుతున్నా దొరకక, తిండిలేక మమ్మల్ని చూసిన ప్రతి వాళ్ళు అవమానిస్తూ ,హేళన చేస్తు నవ్వడమే గాని, ఏ రకమైన పని దొరకక, ఈ పాడు పనికి పూనుకొన్నము, ఈ “మరుగుజ్జు జన్మ ఎంత నికృష్టమైన దో “ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, అందుకనే మా నలుగురం మూడు నెలలు కష్టపడి మా యొక్క చేతి’ వెలిగోళ్లు ‘ పెంచి ఒక జంతువు మాదిరిగా పదును పెట్టీ, పొట్టి వాళ్ళము గనక వేగంగా కదిలే జనసమ్మర్థం లో కలిసిపోతూ బంగారు గొలుసులు, ఆడవాళ్ళు మెడలో నుంచి లాగుతున్న సమయంలో మా ‘వేలి గోళ్ళు రక్కుతునట్లు’  గా చేసి, అదే ప్రయాణికుల మధ్యలో లగేజ్ వెనకాల దాక్కొని, పారిపోయాము, అలాగే అన్ని చోట్ల మేము పోలీసు లకు దొరక్కుండా తప్పించుకో గలిగాము,కానీ ఆరోజు మా తమ్ముడి’ గోరు ‘ఒకటి విరిగిపోయి దొంగతనం చేసిన మహిళ మెడలో ఉండిపోయింది,అదే మమ్మల్ని పట్టించింది, మేము’ మరుగుజ్జులము గనుక ఎన్ని దొంగతనాలు చేసిన ఎక్కడో ఒక్కడ  దాక్కుని ఆ తర్వాత ఈ ‘మురికి వాడకి ఎవరికీ అనుమానం రాకుండా వచ్చేవాళ్ళం, కానీ ఆ బ్యాంకు దొంగతనం జరిగిన రోజు ‘పోలీస్ కుక్కలు ‘మా వాసనను పసిగట్టి ఇక్కడికి తీసుకు వచ్చాయి! ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు, అంటూ ఆవేశంతో మాట్లాడి ఏడుస్తూ “అయ్యా! మేము మీ లాగే జన్మించిన వాళ్ళము, దురదృష్టవశాత్తు మా కర్మ ఫలం మమ్మల్ని మరుగుజ్జు ని చేసింది, ఈ సమాజంలో అత్యంత అసహ్యంగా ఉన్న మమ్మల్ని అడుగడుగున అవమానపరుస్తూ, మమ్మల్ని బతకనియ్యటం  లేదన్న కోపంతో మేము ఇలాగా దొంగల గా మారాము, ‘మమ్మల్ని ని క్షమించండి’! మాకు అన్ని విధాల ప్రభుత్వం సాయం చేయమని అర్ధిస్తున్నాను, అంటూ ముగించే సరికి అక్కడే ఉన్న పత్రికల వాళ్లకు , పోలీసులకు కూడా కళ్లు చెమర్చాయి! ఇదంతా లైవ్ కవరేజ్ వస్తుండడంతో ప్రజలంతా చూసి  ఆ నలుగురు మరుగుజ్జుల మీద సానుభూతి చెందుతూ, ఇకముందు “అవయవ లోపం” ఉన్న ప్రతి వారిని కూడా గౌరవించి, ఆదరించాలని అని  మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారు టీవీలు చూస్తున్న ప్రేక్షకులు.
“ఈ కథ ఇక్కడితో “నఖాంతం” అయ్యింది.”!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!