వింత శోధన

వింత శోధన

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తో పాటు లేచి పూర్ణ పరందామ కూడా గోవుల సేవ చెయ్యడం అలవాటు
పాలు పితికి పాలేరు ఇంటికి కావాల్సిన లీటర్ పాలు ఇంట్లో ఇచ్చి మిగిలినవి కేంద్రానికి పోస్తాడు
జెర్సీ ఆవు పాలు బాగా ఇస్తుంది. కనుక కొన్ని పాలు కేంద్రానికి పంపుతారు. ఇంట్లో వీళ్ళు కాక ఇద్దరు మనుమలు ఇక్కడ చదువు కుంటున్నారు.
పరంధామయ్య గారు స్కూల్ హెడ్ మాస్టారు చేస్తున్నారు. మనుమల్ని ఇంటర్ లో చేర్పించి చదివిస్తున్నారు. కోడలు కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారికి ఖాళీ తక్కువ పిల్లల్ని పెంచి జాగర్త గా చదివిస్తారు ఇక్కడ పెట్టారు.అలాగే పూర్ణ పిల్లలకి. గుమ్మ పాలు త్రాగడం మంచిది అని అలవాటు చేశారు. పిల్లల యూనిఫాం  ఉతక డానికి చాకలి వస్తాడు. ఇంట్లోనే ఉతికి ఆరాక సాయంత్రం వచ్చి ఇస్త్రీ చేసి పెడతారు. కొంచెం చిన్న ఊరు కనుక ఇంటికి వచ్చి శ్రద్ధగా ఉతుకుతారు . చాకలికి వేరే ఊరు లో పెళ్లి ఉండి, అక్కడకి వెళ్ళాడు .
ఓ పది రోజులు వేరే ఆడ మనిషికి అప్ప చెప్పడం
వల్ల ఆమె వచ్చి బట్టలు ఉతికేది. పూర్ణ ఎక్కువ భాగం పెద్ద జరి అంచు చీరెలు అంచుపై ఎంబ్రాయిడరీ ఉన్నవి కట్టేది.  పూర్ణ బాగా ఎంబ్రాయిడరీ లేసు పని చేసేది వంటలు కూడా బాగా చేసేది చిన్న తనం లో పెళ్లి పేరంటం ఇద్దరు పిల్లలు ఇద్దరు సిటీలో ఉద్యోగాలు మనుమలు ఇద్దరు పూర్ణ దగ్గరే పెరుగుతున్నారు కూతురు విదేశాల్లో ఉంది .పెద్దల మాట విని పల్లెలో పిల్లలని పెట్టారు అయితే పూర్ణ ఇంటి పని అంతా చెయ్యి లేక పని వాళ్ళ పై ఆధారము పార్వతి ఆ ఇంట్లో పాతిక ఏళ్ళు గా పని చేస్తోంది ఇంట్లో పూచిక పుల్ల కూడా పోనివ్వదు. ఉదయం అరు గంటలకి వచ్చి
గుమ్మ ము పాచి చేసి ముగ్గులు పెట్టీ కాఫీ లు అయ్యాక తాగి, దొడ్డి తుడుస్తుంధి ఈ లోగా సామాను అంతా కడిగి పక్కన పెడుతుంది. టిఫిన్ తిని బట్టలు నాన వేసి వెడుతుంది. పూర్ణ స్నానం పూజ చేసి వంటలోకి  వెలుతుంది. కూరలు రెండు ఉండాలి ఒకటి పప్పు కూర  ముద్ద కూర పచ్చడి చారు ఉండాలి. పులుసు లేక మజ్జిగ పులుసు ఉండాలి వంట పూర్తి అయ్యే టప్పటికి స్కూల్ నుంచి  కాలేజ్ నుంచి మనుమలు వస్తారు
పార్వతి పన్నెండు గంటలకి వచ్చి టీవీ చూస్తూ కూర్చుని భోజనాలు అయ్యాక మిగిలినవి పట్టుకు వెలుతుంది. ఆలాగే సామాను కూడా కొన్ని
తోమి పెట్టీ వెడుతుంది సాయంత్రం.వచ్చి ఇల్లు సంధ్య గుమ్మాలు తుడిచి వేదుతుంది. సాయంత్రం కూడా టిఫిన్ పకోడీలు బజ్జీలు వంటివి వేస్తుంది అవి పెడుతుంది. ఇంకా పదకొండు గంటలకు బట్టలు ఉతకడానికి కొత్త మనిషి వచ్చి ఉతికి ఆరవేసి వెడుతుంది. ఒక రోజు అమ్మగారు నాకు వెండి సెమ్మ కనిపించక లేదు మీరు లోపల పెట్టరా అన్నది.
ఇంట్లో సరుకులు పూర్ణ తో పాటు పార్వతి అన్ని లెక్కలు చెపుతుంది .ఆయ్యీ నాకు జ్ఞాపకం లేదు కార్తిక మాసం కదా ఎక్కువ భాగం మట్టి ప్రమిదేలు వాడు తున్నా ను అందుకు అజ లేదు అంటూ పూర్ణ రెండో సెమ్మా కోసం వెతికింది పాత్రలు తో మే మనిషి ని నాకు అన్ని జ్ఞాపకమే అన్నది.ఇంటికి ఎవరూ కొత్త వాళ్ళు రారు నేను బట్టలు ఉతికే రత్తాలు తప్ప ఇంకెవరూ వస్తారు?పూర్ణ పార్వతి ఆలోచనలో పడ్డారు ఇప్పుడు కొంటే చాలా రేటు ఉంటాయి
మా పుట్టింటి వారు గృహ ప్రవేశానికి ఇచ్చారు అప్పుడే అవి ఇరవై వేలు ఆయనకి తెలిస్తే బాధ పడతారు అంది.అవును అమ్మా అత్తగారు మామగారు కూడా మీకు చాలా వెండి వస్తువులు ఇచ్చారు అయితే ఈ రోజులను బట్టి అన్ని లోపల దాచి పూజ సెమ్మలు మాత్రం.వాడుతున్నారు
ఆయన మంచి వారు కనుక కొప్పడక బాధ పడతారు. ఎంత మంచి అయ్యో అని పార్వతి మెచ్చుకున్నధి.ఈ విషయం మనుమలు విన్నారు  నానమ్మ ఏమిటి ?.నీ భయం మేము ఉన్నాము కదా
మేము పరిశోధన చేస్తాము.పార్వతి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పు అమ్మ గారు సేమ్మ కనిపించడం లేదు ఎన్నో తరలది అది అని చెప్పింది.
అమ్మ గారు అయ్య గారు బాధ పడుతున్నారు అధి తిరిగి వాళ్ళ మనుమలకి ఇవ్వడం అలవాటు.
అందుకే నిన్న తాకట్టు వాకట్టు బంగారు వెండి కోట్లు అన్ని వెళ్లి అడిగి వచ్చారు నేను ఎప్పటి నుంచో పని చేస్తున్నాను ఇంకా నువ్వే కొత్త దానివి కదా
నిన్ను అడుగుతారు జాగ్రత్త సుమా ఆ మాట విన్న రత్తాలు కొంచెం ముఖంలో మార్పులు వచ్చాయి
ఆ తరువాత రెండు రోజులు భర్తకి బాగా లేదని మానేసింది దాంతో పార్వతి
అనుమానం నిజం అయ్యింది. నీకు డబ్బు కావాలంటే నేను అప్పు ఇప్పిస్తాను నువ్వు నిజంగా సెమ్మ్ పట్టు కెడితే తెచ్చి ఇచ్చేయి ,అంతే కానీ మళ్ళీ గుమ్మంలోకి ఎవరు నిన్ను రానివ్వరు ఊళ్ళో తెలిస్తే నిన్ను పానికి పెట్టు కోరు అని పార్వతి అనునయంగా చెప్పింది ఎందుకంటే రత్తాలు ముఖంలో మార్పు కనిపిస్తూ ఉన్నది .ఏమనుకున్నా దొ తెలియదు మూడు రోజులకు వచ్చి వీధి గదిలో కుర్చీ కింద పడేసింది.బట్టలు ఉతికి వెళ్లిపోయింది  సాయంత్రం పార్వతి ఇల్లు తుడుస్తూ అమ్మ సమ్మె దొరికింది అంటూ తెచ్చి ఇచ్చింది. ఇదే ఇంటి దొంగని ఈశ్వరుడు పట్ట లేరు అంటారు కనుక మనవలు చెప్పిన ప్లాన్ పార్వతి అమలు చేసి పట్టుకున్నది.
ఆర్థిక సమస్య అందరికీ ఉంటుంది ఎంత చెట్టుకు అంతా గాలి అంటారు.దాని మొగుడు సంపాదన వాడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతాడు దీన్ని పనికి వెళ్ళ నివ్వడు పెళ్ళముధ్యోగం వాడికి తప్పు ఇప్పటికీ ఎందరో చాదస్తులు వారు డబ్బు చాలక ఆడవాళ్ళను పనికి వెళ్లనివ్వక భాధిస్తున్నారు
నా నాటి బ్రతుకు నాటకము శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారాంశము తెలుసుకుని జీవించాలి.ఈ రోజుల్లో ఆడ మగ సంపాదిస్తే గాని సిటీస్ లో పిల్లలను పెంచ లేరు ,చదివించాలి
అంటే ఎంతో ఆర్ధిక స్తోమత కావాలి అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!