సివంగి సింధూ

సివంగి సింధూ

రచన : మాధవి కాళ్ల

                   సింధూ  సాయంత్రం తొందరగా  రా  పెళ్లి వాళ్లు వస్తున్నారు. అని చెప్పింది సరళ, సరే అమ్మ  నేను ఆఫీస్ కి వెళుతున్న అని చెప్పింది  సింధూ. సింధూ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది .ఆఫీస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది సింధూ. సరళ ఇంటి పనులు పూర్తి చేసి కూర్చుంది. దాహంగా  ఉంది అని కిచెన్ లోకి వెళ్ళింది అంతే అక్కడ పిల్లిని చూసి  భయంతో బయటికి పరుగు పెట్టింది. సాయంత్రం సింధూ ఇంటికి తొందరగా వచ్చింది. అమ్మ ఏమైంది అని సింధూ అడిగింది. సరళ పిల్లిని చూసి భయపడ్డాను అని చెప్పింది. సింధూ నవ్వుతూ అమ్మ ఎన్ని సార్లు చెప్పాను ప్రతి దానిని చూసి భయపడొద్దు అని. సరే సింధూ వెళ్లి రెడీ అవ్వు పెళ్లి వాళ్లు ఎక్కడ ఉన్నారో కాల్ చేస్తాను అని చెప్పింది సరళ. పెళ్లి వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగింది సరళ. హా  వస్తున్నాము అని చెప్పారు. ఐదు నిమిషాలు తరువాత పెళ్లి వాళ్లు వచ్చారు . సింధూ అందరికీ కాఫీలు తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చి కూర్చుంది. సింధూ అబ్బాయిని చూడు అని చెప్పింది సరళ. సరే అని అబ్బాయిని చూసి సరళ వంక చూసి నచ్చాడు అని చెప్పింది సింధూ . ఆంటీ నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి అని అడుగుతాడు అబ్బాయి. మేడ మీదకి  వెళ్లి మాట్లాడుకోండి అని చెప్పింది సరళ సింధూ తో. ఇద్దరు మేడ మీదకి వచ్చి కూర్చున్నారు . నా పేరు కళ్యాణ్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అని చెప్పాడు. మీరు నాకు బాగా నచ్చారు. మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పాడు. హా చెప్పండి  ఏంటి అది అని అడుగుంది సింధూ. అది నేను ఒక మంత్ ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళుతున్నాము . తరువాత పెళ్లి  చేసుకుందాం అని చెప్పాడు కళ్యాణ్. సరే అండి నాకు ఇష్టమే అని చెప్పింది సింధూ. కళ్యాణ్ అమ్మ నాన్న మంచి ముహూర్తం చూసి కాల్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. సరళ నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కొన్ని రోజులలో నీకు పెళ్లి .. సింధూ సిగ్గు పడుతు తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒక రోజు ఉదయం ఒక రౌడి వచ్చి  మీ ఇల్లు నాకు ఇచ్చేయండి అని చెప్పాడు. సింధూ ఎందుకు ఇవ్వాలి అని అడిగింది. మీ నాన్న గారు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు మాకు కావాలి అని చెప్పాడు రౌడి. సరళ మాకు తెలీదు మీరు తప్పు అడ్రస్ కి  వచ్చారేమో అని అడిగింది. లేదు కరెక్ట్ అడ్రస్ కే వచ్చాము అని చెప్పాడు రౌడి. మీ ఇల్లు చాలా బాగుంది  మాకు కావాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సింధూ కోపంతో మేము ఇల్లు ఇవ్వాము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పింది సింధూ. ఒక నెల రోజులు గడువు ఇస్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయాడు రౌడి. సింధూ కోపంతో  ఆఫీసుకి వెళ్ళిపోయింది.. ఈవెనింగ్ సరళ కి కాల్ చేసి అమ్మ నేను అరుణ ఇంటికి వెళుతున్న అని చెప్పింది సింధూ. సరే తొందరగా వచ్చేయి అని చెప్పింది సరళ. హా సరే అమ్మ  అని చెప్పింది సింధూ. అరుణకి ఉదయం జరిగిన సంఘటన  గురించి చెప్పింది సింధూ. రెండు గంటలు తరువాత ఇంటికి వెళ్తుంది సింధు. అలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది సింధూ. అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది అప్పుడే సరళ లేచి  వాటర్ తాగడానికి కిచెన్ లోకి వచ్చింది అప్పుడే చిన్నగా గజ్జల సౌండ్ వినిపించింది తర్వాత సరళ వెనకాలనుంచి ఎవరో వెళ్తున్నట్టు నీడ కనిపించింది. కొంచెం భయం తో సింధు దగ్గరికి వెళ్లి సింధు ఎవరో ఇంట్లో తిరుగుతున్నారు నాకు భయమేస్తుంది అని లేపింది  సింధూ ని ఎవరు లేరు అమ్మ అని చెప్పి పడుకుంది సింధు. కాసేపు తర్వాత ఒక అమ్మాయి అరుపు వినిపించింది నిద్రలో ఉండే వాళ్ళు అందరూ లేచి ఎవరు అరుస్తున్నారు  అని చూస్తారు కానీ ఎవరూ కనిపించరు. అయితే  సింధు ఇంట్లో చూస్తారు అక్కడ నీడ కనిపిస్తుంది నీడను చూసి  ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ భయంతో ఎవరికి నిద్ర పట్టదు రాత్రి. సరళ భయంతో నీడను చూసి షాక్ తో వణికిపోతుంది. సింధూ కూడా ఆ భయంతోనే ఉంటుంది. మార్నింగ్ లేచి కాలనీలో ఉన్న వాచ్మెన్ ఒక మాంత్రికుడిని తీసుకొస్తాడు.  ఆ మంత్రికుడు సింధు వాళ్ళ ఇంట్లో మధ్యలో కూర్చొని పూజ చేస్తాడు అప్పుడు అక్కడికి ఒక దెయ్యం  వస్తుంది సింధు సరళ భయం తో బయటికి వెళ్లి పోతారు… ఆ మాంత్రికుని దెయ్యం కొడుతుంది ఆ భయంతో అక్కడ నుంచి  పారిపోతాడు ఇలా ప్రతిరోజు ఎవరికి నిద్ర లేకుండా చేస్తుంది దెయ్యం. సరళ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది. నా కన్న కూతురే భయపడుతుంది తనకే ధైర్యం చెప్పాల్సింది నేను కూడా భయపడుతున్న లేదు నేను ఇప్పుడు నుంచి  నా కూతురికి ధైర్యం చెప్పాలి నేను ధైర్యంగా ఉండాలి అని అనుకుంటుంది … సింధూ ఆ రౌడి కి కాల్ చేసి మీరు ఇల్లు తీసుకోండి అని చెప్పింది.ఏంటి సడన్ గా మీకు గడువు ఇచ్చాను కదా ఆ గడువులోపే తీసుకుంటాము అని చెప్పాడు రౌడి. చీకటి పడింది మళ్లీ అదే భయం .. ఆ దెయ్యం ఏవేవో శబ్దాలు చేస్తూ అందరిని భయపడుతుంది సరళ ఎప్పటిలా భయపడకుండా సింధూ కి  ధైర్యం చెబుతూ పడుకున్నారు. సరళ లో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తుంది సింధు. తరువాత రౌడికి  డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంట్లో దయ్యం ఉందని తెలిసి సింధూ కి  ఫోన్ చేసి  ఆ ఇల్లు మేము తీసుకోము  అని చెప్పాడు రౌడి. సింధూ నవ్వుతూ హమ్మయ్య సమస్య తీరిపోయింది సంతోషంగా ఇంటికి వెళ్తుంది.. సరళ మీ పెళ్ళికి ముహూర్తం కుదిరింది ఇప్పుడే కళ్యాణ్  ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పింది సింధుకి.. సరే అమ్మ ఆ రౌడి వాళ్లు మన ఇల్లు తీసుకోరు అని చెప్పింది సింధూ.. శుభవార్త చెప్పావు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది సరళ.. కొన్ని రోజులు తరువాత కళ్యాణ్ అమెరికా నుంచి వచ్చాడు. అరుణ సింధూ పెళ్లి కి వచ్చి అడిగింది. ఏమైంది మీ కాలనీ వాసులు అందరూ భయపడుతున్నారు మీ ఇంట్లో దెయ్యం ఉందా అని అడిగింది. మా ఇంట్లో దెయ్యం లేదు. నేను నమ్మేలా చేశాను అదే ఎందుకు చేశావు అని అడిగింది అరుణ … ఒక రోజు మీ ఇంటికి వచ్చి నా సమస్య గురించి చెప్పాను కదా అప్పుడు ఇంటికి వెళుతుంటే దారిలో దెయ్యం లా వేషం వేసి అందరిని భయపెట్టుతున్నారు .. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది.. వాళ్ళతో మాట్లాడి దెయ్యం ఉంది అని అందరినీ నమ్మించాను .. ఆ రౌడి కూడా భయపడి మా ఇల్లు తీసుకోలేదు మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే అమ్మ లో చాలా మార్పు వచ్చింది అని చెప్పింది సింధూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!