అతను… ఆమె

రచన – తపస్వి

(గమనిక: ఈ కథలో ఇద్దరి మధ్య… ఏకమయ్యే రెండు శరీరాలను కాక… పరిపూర్ణ ప్రేమని మాత్రమే చూడమని మనవి…)

“ఓ సారి నిన్ను నా కూతురిలా దగ్గరకి తీసుకుని లాలించాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ బిడ్డలా నీ ఒడిలో సేద తీరాలి అనిపిస్తుంది…

ఓ సారి సోదరుడిలా నీకు నేను ఉన్న అనే ధైర్యం ఇవ్వాలి అనిపిస్తుంది…

ఓ సారి స్నేహితుడిలా నిన్ను ఆట పట్టించాలి అనిపిస్తుంది…

ఓ సారి ప్రేమికుడిలా నీ పెదవుల తడి చూడాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ సైనికుడిలా యుద్ధం చేయాలి అనిపిస్తుంది…

ఓ సారి మన్మథుడిని అయ్యి నీ ప్రేమ రాజ్యానికి రాజుని అవ్వాలనిపిస్తుంది…

ఓ సారి దాసుడిని అయ్యి నిన్ను ఆరాధించాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ చిరునవ్వు కోసం చుక్కలని తెంపి అభిషేకించాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ కన్నీళ్లు చూసి ఈ ప్రపంచాన్ని విధ్వంసం చేయాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ చెయ్యి నా చేతిలో ఉన్నపుడు కాలాన్ని ఆపేయాలి అనిపిస్తుంది…

ఓ సారి నువ్వు నాకు దూరంగా ఉన్నపుడు, అదే కాలాన్ని నిన్ను కలిసే క్షణంలోకి విసిరేయాలి అనిపిస్తుంది…

ఓ సారి ప్రేమగా నీ నుదుటన ముద్దు పెట్టాలి అనిపిస్తుంది…

ఓ సారి ఆశగా నీ గుండెలపై సేద తీరాలి అనిపిస్తుంది…

ఓ సారి నా జీవితం నీది అని చెప్పాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ కోసం ఎన్ని జన్మలు అయినా ఎత్తాలి అనిపిస్తుంది…

ఓ సారి నా సంతోషం నీవే అని చెప్పాలి అనిపిస్తుంది…

మరోసారి నా బాధకి కారణం కూడా నువ్వే అని చెప్పాలి అనిపిస్తుంది…

ఓ సారి నిన్ను చూడటం కోసం సప్త సముద్రాలు అయినా దాటాలి అనిపిస్తుంది…

ఓ సారి నిన్ను కలిసే మార్గం లేనపుడు నన్ను నేను చీకటిలో బంధీ చేసుకోవాలి అనిపిస్తుంది…

ఓ సారి నీ రూపాన్ని నా కనులలో నిలుపుకుంటే చాలు అనిపిస్తుంది…

ఓ సారి ప్రేమతో నీలో కలిసిపోతే బాగుండు అనిపిస్తుంది…

ఓ సారి నీ సంతోషం కోసమే బ్రతకాలి అనిపిస్తుంది…

ఓ సారి ఆ సంతోషం నేనే అవ్వాలి అనిపిస్తుంది…

ఓ సారి నువ్వు నాకు దూరం అవుతావు అనే ఆలోచనతోనే ఈ ప్రపంచం నుండి దూరం అవ్వాలి అనిపిస్తుంది…

మరోసారి అదే ప్రపంచం నుండి నిన్ను మాయం చేసి నా ప్రేమ రాజ్యానికి యువరాణిని చేయాలని అనిపిస్తుంది…”

అతను చదవటం పూర్తి చేశాడు… ఆమె విన్న ప్రతి పదాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంది. ఓ క్షణం నిశబ్దం… ఆమె మోముని చూస్తున్నాడు అతను.

“చాలా బాగుంది… ఎవరి కోసం రాశారు…?”

తన కోసమే రాశారు అని తెలిసి కూడా అడిగింది ఆమె.

“నా రాక్షసి కోసం…” చిలిపిగా ఆమె కనులలోకి చూస్తూ అన్నాడు అతను.

“ఆ రాక్షసికి ప్రేమంటే అర్థం తెలీదు…!” చూపు మరుల్చుకుంది.

“చల్లని వెన్నెలను పంచుతుంది అని జాబిలమ్మకి కూడా తెలీదు…”అతని సమాధానం.

అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది… “ఎందుకు మీరు నాకు ముందే పరిచయం అవ్వలేదు?” ఎపుడూ అతను అనే మాట, మొదటిసారి ఆమె నోటి నుండి వచ్చింది.

“మనకి ఎపుడు, ఏది, ఎవరు అవసరమో… మన కంటే ఆ దేవుడికే బాగా తెలుసు అనుకుంటా…” ఇంతకు ముందు ఆమె ఇచ్చిన సమాధానాన్నే ఇపుడు అతను ఇచ్చాడు… ఆమె కాటుక కనులలోకి చూస్తూ.

“అవునా…!” అంది చిరునవ్వుతో… ఆ కళ్ళని గుండ్రంగా తిప్పుతూ.

తను పరిచయం అయినప్పటి నుంచి రోజూ… ఓ క్షణం అయినా ఆ కనులని చూసి ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకునే అతను… ఈ రోజు ఈ ఏకాంతంలో ఆ కళ్ళల్లో అతనిపై ఉన్న ప్రేమ కనిపిస్తుంటే… మైకం కమ్మి… ఆమె మోముని అతని చేతుల్లోకి తీసుకున్నాడు.

ఓ క్షణం తడబడిన ఆమె… అతని కళ్ళల్లో తనపై కనిపించే ఆరాధనను చూసి కళ్ళు మూసుకుంది. ఆమె పెదవులు అదరడం అతనికి తెలుస్తుంది. తేనె రంగు పులుముకున్న జాబిలమ్మలా ఉన్న తనని… అలా చేతులలోకి తీసుకునే ఓ క్షణం వస్తుందని కలలో కూడా ఊహించని అతను… మళ్ళీ అలాంటి క్షణం వస్తుందో రాదో అన్న ఆలోచనతో… ఆ మోమును తనివితీరా చూస్తూ తన హృదయంలో ముద్ర వేసుకున్నాడు.

ఆమె ఊపిరి భారం అతనికి తెలుస్తుంది, అతని శ్వాసలోని వెచ్చదనం కొత్తగా ఉంది ఆమెకి. ఈ రోజు వరకు తమకి తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులలా కాక… ఇద్దరు… ఇద్దరికీ కొత్తగా అనిపిస్తున్నారు…!

కోరుకునే ఏకాంతం… ఊహించని విధంగా అందితే… తమని తాముగా ప్రేమకి కానుకగా అర్పించుకునే క్షణం. అంతకు మించిన ఓ మధుర క్షణం ఏముంటుంది ఏ ప్రేమ జంటకి అయినా…!

పరిపూర్ణ ప్రేమని పొందలేక ప్రేమ అంటే అర్థం తెలీదు అనే ఆమె… ఆకాశం అంత ప్రేమ పంచుతున్నా… అర్థం చేసుకునే మనసు లేక అతను… తమకి తాముగా ఓ ప్రేమ కావ్యాన్ని, కొన్ని జ్ఞాపకాలను… తమ బంధానికి గుర్తుగా మిగుల్చుకోవాలన్న తపన వారిది…!

అనుకోకుండా జరిగే ఓ చిన్న పరిచయం జీవితాలనే మారుస్తుంది అంటారు…! వాళ్ళ ఇద్దరికీ మాత్రం అసంపూర్తిగా… అసంతృప్తిగా గడిచిపోతున్న జీవితాన్ని కొత్తగా పరిచయం చేసింది…!

“అతనికి ఆమె కనులలో తన ప్రతిబింబం చూసుకోవటం ఇష్టం…

ఆమెకి అతని కళ్ళల్లో ఆమెపై చూపే ఆరాధన ఇష్టం…

కొండకోనల్లో పారే జలపాతం సవ్వడిలా ఉండే ఆమె మాటలు అంటే అతనికి ఇష్టం…

చిన్న పిల్లాడిలా అతను ఆమె దగ్గర చేసే అల్లరి ఆమెకి ఇష్టం…

చినుకులకి తడిచిన చిగురాకుల శబ్ధంలా ఉండే ఆమె చిరునవ్వు అంటే అతనికి ఇష్టం…

ఆమె జుట్టు పట్టుకుని… రాక్షసి అంటూ అతను చూపే మొరటుతనం ఆమెకి ఇష్టం…

కష్టం… సుఖం… దుఃఖం… తన మనసులోని మాట మరో ఆలోచన లేకుండా పంచుకునే అతని బంధం ఆమెకి ఇష్టం…

తన సాంగత్యంలో తనని తాను మర్చిపోయే క్షణాలు అంటే అతనికి ఇష్టం…”

నిజమైన తను ఏంటో అతనికి మాత్రమే తెలుసు.

ప్రపంచానికి తెలియని అతనిలోని మరో కోణం ఆమెకి మాత్రమే తెలుసు.

అందుకే వారి కలయిక… వారి సంతోషాల ప్రపంచం.

కలిసిన ప్రతిసారీ… మళ్ళీ కలిసే క్షణం ఉంటుందో, లేదో అన్న ఆలోచనతో… ఆమె కోపం, అలక, ప్రేమ ఆస్వాదించాలి అనుకునే అతను…

ఉన్న సమయంలోనే జీవితానికి సరిపడా సంతోషాన్ని పంచుకోవాలి అన్న ఆశతో ఆమె…

ఆమె ప్రతి మాటలో అతనిపై చూపే ఇష్టంలో ప్రేమని వెతుక్కునే అతను…

నాకు ప్రేమ అంటే అర్థం తెలీదు… నీ ప్రేమ పొందే అర్హత లేదు అంటూనే… గుండె లోతుల్లో అతనిపై ఉన్న ప్రేమని చేతల్లో, మాటల్లో చూపించే ఆమె…

ఇద్దరి మధ్య లోకం అంగీకరించని ఓ విచిత్ర బంధం.

వాళ్ళిద్దరూ కోరుకుని… కావాలని ఏర్పరచుకున్న బంధం.

ఏ జన్మలోనో అసంతృప్తిగా మిగిలిపోయిన బంధాన్ని ఈ జన్మలో మళ్లీ ఆ ప్రేమ దగ్గర చేసిందా…! అనేలా ఏర్పడిన బంధం.

అసంతృప్తిగా ఉన్న ఆమె జీవితానికి పరిపూర్ణత తేవాలని అతను…!

సంతోషాన్ని ఇచ్చే కొన్ని మధుర జ్ఞాపకాలని అయినా అతనికి ఇవ్వాలన్న ఆలోచనతో ఆమె……!!!

***

వాళ్లిద్దరి ఏకాంతాన్ని చూసి ఆస్వాదించాలి… అనుకున్న చందమామకి ఆ గదిలోకి తొంగి చూసే అవకాశం లేక… అలిగి మబ్బుల చాటున వెళ్ళిపోయాడు.

కిటికీ సందుల నుండి దొంగచాటుగా వచ్చిన చిరుగాలి… ఆ గదిలో వారి శ్వాస వెచ్చదనానికి భయపడి పారిపోయింది.

ఆమె మోమును ఒడిసిపట్టిన అతని చేతులు వణుకుతున్నాయి… ఆమె గుండె లయ తప్పి పరిగెడుతుంది… అతని పెదవులు, ఆమె నయనాలను తాకాయి… ఆమె శ్వాస అదుపు తప్పింది.

ఆ పెదవుల తడి ఆమె నుదుటన తాకగానే… ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

అంతకుమించి ఆమెపై ఉన్న ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కాలేదు అతనికి.

స్పర్శలో కోరికను తప్ప ప్రేమని అప్పటి దాకా చూడని ఆమెకి… ఆ తడి కొత్తగా అనిపించింది.

కనులు తెరిచి అతనిని చూసింది. ఆ రోజు వరకు చిన్నపిల్లాడిలా కనిపించిన అతను… ఈ క్షణం మాత్రం ఓ మగాడిలా కనిపిస్తున్నాడు.

అతని పెదవులకి అంటిన బొట్టుని తీసి చిలిపిగా నవ్వుతూ మళ్ళీ తన నుదుటన పెట్టుకుంది.

ఆమె చిలిపి నవ్వును చూసి… ఆమె చెక్కిలిని చిన్నగా గిల్లాడు అతను.

“”అబ్బ… నొప్పి పెడుతుంది…” ముద్దుగా అంది ఆమె.

“కొన్ని నొప్పులు జ్ఞాపకాలుగా బాగుంటాయి…” అంతే చిలిపిగా అన్నాడు అతను.

“చెప్పటం మర్చిపోయా… కొత్త పట్టీలు పెట్టుకున్నా…” అంటూ ఆమె రెండు కాళ్ళని అతని ముందు పెట్టింది అతనేం చేస్తాడో ఊహిస్తూ…

ఆమె ఊహని నిజం చేస్తూ… ఆమె పాదాల చెంత చేరి… ఆమె పాదాలను చేతిలోకి తీసుకుని… ఆ పాదాలపై ముద్దుల వర్షం కురిపించాడు అతను. పరవశంతో అతని పిచ్చి ప్రేమని ఆస్వాదిస్తూ… “ఇక చాలు ప్లీజ్…” అంది గోముగా.

ఆమె పరిస్థితి అర్థం చేసుకుని… చిరునవ్వుతో లేచి… ఆమె పక్కకి చేరి… ఆమె చెవి అంచుని మునిపంటితో కొరికాడు.

మైకం కమ్మి… అతని జుత్తు ఒడిసిపట్టి… “ప్లీజ్… ఆపమన్నా కదా…” అంది మత్తుగా.

“రాక్షసి…” అంటూ ఆమె జుట్టుని గట్టిగా పట్టుకుని… మత్తులో జోగుతున్న ఆమె కనులలోకి చూస్తూ… “ఇలా ఆశ పెట్టి… మధ్యలో చాలు అనకూడదని ఓ ప్రేమ దేవత చెప్పింది… చేయాలనిపించింది… ఎవరు వద్దు అన్నా చేయాలంట…” ఆమె మెడ అంచున పెదవులతో ముద్ర వేస్తూ అన్నాడు అతను…

అతని జుట్టుని గట్టిగా పట్టి… అతని ముఖాన్ని ఆమె మోము ముందుకి తీసుకుని… “అలాగా!! ఇక చాలు… ప్లీజ్ అంటే, ఇలాంటి టైమ్ లో… అర్థం ఏంటో మీ… ఆ ప్రేమదేవత చెప్పలేదా… ఈ మొరటోడికి…!” అతని చెంపలను తన చేతులతో తడుముతూ అంది.

“చెప్పలేదు… ఈ రాక్షసి చెబుతుంది అంది…” అన్నాడు… ఆమె నడుము ఒంపులని తడుముతూ ఓ చేత్తో…

ఇంతకు ముందు ఆమె కనులలో కనపడని ఓ మైమరపు ఏదో అతనిని ఉసిగొల్పుతున్నది.

“అది కూడా నేనే చెప్పాలా…!” నోటి దాకా వచ్చింది కానీ… ఆ పదం ఆమె పెదవులని దాటేలోపే…ఆమె పెదవులు… అతని పెదవులతో ముడిపడ్డాయి.

అలా ఎంత సమయం గడిచిందో తెలీదు. వారి పెదవులు వారి శరీరాలలో ఏ అంచులని తాకాయి తెలీదు, కాలం స్తంభించింది. సిగ్గుతో రతీమన్మథులు అక్కడ నుండి నిష్క్రమించారు.,వారితో పోటీ పడలేక గోడ గడియారం అలిసిపోయింది.

శారీరక కలయిక ఓ అవసరం మాత్రమే అనే వాళ్ళ జీవిత భాగస్వాములు ఆలోచనలలో, ఇన్ని రోజులు బందీలు అయిన ఆ ఇద్దరు… వారిద్దరి కలయికలో పరిపూర్ణ ప్రేమకి ఆఖరి అంకం… ఇష్టంతో… ప్రేమతో ఒకరిని ఒకరికి అర్పించుకోవటం… అని గుర్తించి… జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని… ఓ జ్ఞాపకాన్ని… వాళ్ళ ప్రేమ బంధానికి గుర్తుగా ఇద్దరి హృదయాలలో బంధించుకుంటూ… మన్మథ సామ్రాజ్యంలో… స్వేచ్ఛగా విహరించసాగారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!