ఈ నాటి జానకి

ఈ నాటి జానకి

రచన:: జయకుమారి

రామాయణంలో  అయినా మహాభారతం లో అయినా, ఈ నాటి సమాజంలో అయినా ఎందరో సీతల కథ ఇది.

ఒసేయ్.. జానకి..ఎప్పుడు చూడు ఒకటే ఏడుపు !మీ ఆయన చెప్పింది విని,ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ, వాళ్లకి వండి పెట్టుకుంటే సరిపోతుంది.నువ్వు ఉద్యోగాలు చేసి దేశాలు ఏలేస్తావా! ఏమిటి? ఏమి లోటు నీకు,నువ్వు సంపాధిస్తే కానీ ఇల్లు గడవదా ఏంటి..నువ్వు ఆడదానివి, గుట్టుగా ఇంటి పట్టున ఉండి సంసారం చేసుకోక , అది చేస్తా, ఇది చదువుతా అంటూ..వాడికి  మనస్సు శాంతి లేకుండా చేస్తావు.నువ్వు ఎక్కడ దొరికావే మా ప్రాణానికి..అయినా మా  ఇంట వంట లేవు అమ్మా!ఇలా ఉద్యోగాలు పేరు చెప్పి ఊళ్ళు పట్టుకొని తీరగడం.ఇదిగో చూడు…

నీకు ఇదే చెబుతున్న  ఇక మీదట నువ్వు చదువు, ఉద్యోగం అంటూ వాడిని తిరగకుండా,ముందు ఆ ఏడుపు ఆపి…పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చి ,శుభ్రంగా స్నానం చేసి రెడి గా ఉండు.వాడిని సంతోషపెట్టు. వాడికి కోపం తెప్పించే పనులు చెయ్యకు అని తిట్టుకుంటూ.. వెళుతున్న అత్త గారిని చూసి ..

జానకి: నీ లాంటి ఆడవాళ్లు ఉండగా ఏ అమ్మాయి అయినా తను అనుకున్నది సాధించలేదు.ఆడవాళ్లే ఆడవాళ్ళను అర్ధం చేసుకోలేకపోతే, మగవారు ఎందుకు అర్ధం చేరుకుంటారు.ఇది నా కర్మ .ఏమి చేస్తాం! అనుకుంటూ పనులు చేసుకుంటూనే ఉంది కానీ, ఏడుపు ఆగడం లేదు.పిల్లల్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేస్తూ వుండగా మళ్ళీ అత్త గారు వచ్చి మాట్లాడుతూ ఉండటం వల్ల పిల్లలు మళ్ళి లేచి కూర్చున్నారు.

ఈ లోపులో రానే వచ్చారు రామ్.

జానకికి  రామ్ ని చూడగానే భయంతో అక్కడ నుంచి తప్పుకుంది.

అత్త గారు: చూడరా మీ ఆవిడకి ఇందాకనగా చెప్పా, పిల్లల్నీ నిద్రపుచ్చమని.

రామ్: అది పనికిమాలిన వెధవ అమ్మ!దానికి మనం చెప్పలేము.ఏమైనా అంటే ఏడుస్తు ,కోపం తెచ్చుకోవడం  తప్ప  ఏమి తెలియదు.

జానకి: ఆ మాటలు విని జానకి వచ్చింది. నిద్రపోతున్నారు అనగా అత్తయ్య గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ లేచి కూర్చున్నారు అండి.

రామ్: నోరుముయ్యి , నువ్వు ఏదో ఉత్తమురాలు అనుకోకు!అయినా” నీ లాంటి వెధవ లకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో ఆ భగవంతుడు “అనగానే !

అప్పటి వరకు  ఎన్ని మాటలు అన్న ఓర్పుతో, సహనంతో  భరించిన జానకి  ఇక ఆగలేకపోయింది.

ఇన్నాళ్లు కంటిలో కడలిని, గుండెల్లో అగ్నిపర్వతం బద్ధలవ్వకుండా ఆపుకుంటున్న  జానకి.

ఆ సీతమ్మ తల్లిలా ,సహనంతో అన్ని భరిస్తూ వచ్చింది.

అవును!

నాలాంటి దానికి పిల్లలు ఇచ్చి తప్పు చేసాడు భగవంతుడు.అంతా…  అంతా ..ఆయనే చేసాడు!నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు,నేను చదువు కోవాలి అని పెళ్లి కి ముందే చెప్పాను. అలా అంటే ఒప్పుకోవడం లేదు అని ఎవరినో లవ్ చేస్తున్నా అని చెప్పినా వినకుండా. నన్ను పెళ్లి చేసుకున్నారు. పోనీలే నేను అంటే ప్రేమ ఏమో!  అందుకే నేను వద్దు అంటున్నా పెళ్ళి చేసుకున్నారు. నా అభిప్రాయాలు గౌరవిస్తారు.నా ఇష్టం ప్రకారం జాబ్  చేయనిస్తారు. అనుకున్నాను. కానీ ఎప్పుడూ నేనే సర్దుకోని, నా ఇష్టాలు అన్ని మనస్సులోనే  చంపుకొని బ్రతుకుతున్నా. ఇప్పుడు కాదు పెళ్లి అనుకున్న క్షణం నుంచి, నా నుంచి నాకు ఇష్టం అయినవి అన్ని ఒక్కొక్కటి దూరం అవుతూనే ఉన్నాయి. అయినా కానీ నేను ఏ రోజు పెదవి విప్పలేదు. ఒకటి కాదు నా లైఫ్ ని,కూడా మీ కోసం నేను వదులుకున్న “పాట నా ప్రాణం.” ఆ రోజు రెండు జోన్స్ లో విన్ అయ్యి . ఫైనల్ కి సెలెక్ట్ అయ్యాను.

నా మటికి  అది  ఎవరికో కానీ దొరకని అదృష్టం అది . అది ఎంత ఇష్టం గా ప్రాక్టీస్ చేసానో తెలుసా! మా ప్రిన్సిపాల్ కాలేజ్ కి మంచి పేరు వస్తుంది. అది నీ వల్లే సాధ్యం అని నాకు అవసరమైన ఖర్చులు అన్ని ఆమె పెట్టుకున్నారు.

చివరి నిముషంలో ఎంగేజిమెంట్ అయ్యింది  అనే  ఒకే ఒక కారణంతో నన్ను ఆ కాంపిటేషన్ కి వెళ్ళనివ్వకుండా చేశారు. అప్పుడు కూడా నేను ఏమి మాట్లాడలేదు. కాదు కాదు మాట్లాడనివ్వలేదు కారణం అమ్మాయిని కదా.

తర్వాత జాబ్ విషయంలో కూడా అంతే.

“జాబ్ తెచ్చుకో అంటారు.”

“కానీ టైం ఇవ్వరు.”

అన్ని పనులు చేసి బుక్ తీసిన ఏదో ఒకటి అంటారు.

తీరా..

పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత నువ్వు వెస్ట్ అంటారు. చదవడానికి టైం ఇవ్వకుండా మంచి ఫలితాలు ఎలా వస్తుంది. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ,కానీ మనస్సును బాధ పెట్టె మాటలు ఎందుకు మాట్లాడతారు.

ఇంట్లో పని అంతా చక్కబెట్టు కొని,అందరికి అన్ని చేసిపెట్టి .నాకు మిగిలిన టైం లోనే జాబ్ కోసం చదువుకుంటున్న మీకు అది కూడా తప్పే! దానికి నేను ఏదో తప్పు చేస్తున్నట్టు. నన్ను వదిలేస్తా అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి.

“మీరు వదిలేస్తారు అన్న భయంతో నేను సర్దుకుపోవడం లేదు.”

కేవలం “మన బంధానికి నేను ఇచ్చే విలువ అంతే.” పిల్లల భవిష్యత్తు దృష్టి లో పెట్టుకొని. అంటే వాళ్ళని పెంచలేక కాదు.వారికి తల్లి,తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి, అందుకు ఎవరు ఏమన్నా,తిన్నా, తినకపోయిన. కన్నీరు దిగ మింగుకుంటూ బ్రతికేస్తున్న. ఎదురు తిరిగితే ఎంత సేపు పడుతుంది.”బంధం తెగిపోవడానికి.” నీకు జాబ్ రాదు అంటారు. ఎందుకు రాదు ప్రయత్నం చేస్తే, నాకు కొంచెం టైం ఇచ్చి, నాకు సపోర్ట్ గా నిలబడండి. నేను సాధించక పోతే అడగండి.

రామ్ : నీ మొఖం ! నిన్ను వదిలితే నీ ప్రేమికుడు దగ్గరకు వెళ్లిపోతావ్.

జానకి: అసలు కారణం అది. మీకు నా మీద నమ్మకం లేదు.

రామ్: “నువ్వు ఏమైనా సీత లా ప్రతివ్రతవా!”

జానకి: అవును నేను కాదు. మీరు ఏమైనా  శ్రీరామచంద్రులా ఆ శ్రీరాముడు మీలా భార్యను అనుమానించలేదు,

అనుక్షణం సీత కోసం తపన పడ్డాడు. ప్రేమ ను ఇచ్చాడు, సీత కోసం రాముడు ఉన్నాడు . అనే ధైర్యం ఇచ్చాడు.

మరి మీరు ఏ రోజు అయినా తిన్నవా ,ఉన్నవా అని పట్టించు కున్నారా! మీకు  నా శరీరం అవసరమైనప్పుడు  వస్తారు, మీ పని చూసుకొని వెళ్తారు. ఇలా చెప్పు కుంటూ పోతే  అన్ని నా మనస్సు ను గాయ పరిచే విషయాలు తప్పా! మధుర జ్ఞాపకం గా పదిలంగా దాచుకునే అనుభవం లేదు.

“ఇదేనా పెళ్లికి అర్ధం ” ఇంతేనా జీవితం. తెల్లారి లేచింది మొదలు మీకు అన్ని సేవలు చెయ్యడం. వండి  వడ్డించడం.

ఇంతేనా నాకంటూ ఒక అభిరుచి ఉండకూడదు అంతేనా మీరు అనేది. అలసిపోయి ఉన్న నాకు ఏ రోజు అయిన  కాస్త ప్రేమను పంచారా,!ఓదార్పు నిచ్చారా! నీకు తోడుగా నేను ఉన్న అన్న భరోసా ఇచ్చారా!

లేదు!నేను చేసిన చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా చూపి.మీ మాటలతో నన్ను మానసికంగా కృంగిపోయాల చెయ్యడం తప్పా. తాళి కట్ట గానే మొగుడు అయ్యిపోడు, భార్యను గౌరవించి,ప్రేమించి,తన ఇష్టాలకు కూడా

విలువ ఇచ్చిన నాడు ఆ భార్య మీకు తిరిగి  “పంచే ప్రేమకు ఆ ఎవరేస్టు  కూడా సరిపోదు”. ఒక సారి ఆ ప్రేమ ను రుచి చూడండి.

మీకే తెలుస్తుంది .  నేను ప్రతివ్రతనో ,కానో, అయిన

ఇప్పుడు ! ఈ క్షణం చెబుతున్నా వినండి.

ఆ ప్రేమ ను పొందే అర్హత కూడా మీకు లేదు. ఎందుకు అంటే మగాడు అనే గర్వము మీకు. నాకు తెలియక అడుగుతున్న మగాడు అయితే ఏంటి. మీరు బయట ఎలా అయినా తిరిగి రావొచ్చు, కానీ నేను ఇంట్లో కాసేపు ఫోన్  చూసిన తప్పు. భార్య మీదా ప్రేమ ఉన్న ఆ రాముడు. ప్రజలు ఏదో అనుకుంటారు అని  ఆ జానకి ని వదిలేశారు. కానీ మీలా భార్య అంటే నా కాళ్ళ కింద పడి ఉండాలని ఎప్పుడు అనుకోలేదు.

లోక మాత ,సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి కే తప్పలేదు. నిందలు పడటం. ఇక ఈ జానకి ఏ పాటిది.

“ఏ కాలం అయినా ఆడదాని బ్రతుకు ఎప్పుడు శోకసంద్రమే చేస్తారు” మీలాంటి మగ వారు. “మీకు కావాల్సింది.” మా శరీరం మాత్రమే మీ కోరికలు తీర్చడానికి,సేవలు చేయడానికి.మాకు మనస్సు ఉండకూడదు.ఆశలు, ఆశయాలు ఉండకూడదు.కానీ ఆనాటి రాముడు సీత పై ప్రేమ,నమ్మకం ఉంది.ఈ నాటి రామ్ లో నమ్మకం,ప్రేమ లేవు.ఒకటి మాత్రం నిజం.భర్త అనే వాడు భార్య మనస్సు తెలుసుకొని. గౌరవించక పోయిన పర్వాలేదు.

కానీ అవమానిచకండి.”ఇప్పుడైనా నోరు విప్పకపోతే నా స్త్రీ ఆత్మగౌరవాన్ని నేనే అవమానించి నట్లు అవుతుంది.”ఆ నాడు శ్రీరామరాజ్యం లో సీత… ఈ నాటి భారతంలో నా లాంటి జానకి లు ఎంత మందో.. భూమాత ఒడిలో అవమానాలు భరించలేక కలిసిపోయే వారు ఎందరో.. మరి ఎందరో..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!