ఆటో అయ్యోరు

ఆటో అయ్యోరు

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

నితీష్ సీతారామయ్య బడికి వచ్చాడు. సీతారామయ్యోరు ఎంతో పేరు తెచ్చారని ఆ బడికి ఆయన పేరే పెట్టారు.బడి ఖాళీగా ఉంది పిల్లలెవరూ లేరు. హెడ్మాస్టరనుకుంటా చేతులు నలుపుకుంటూ దిగులుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.నితీష్ ఆయన్ని సమీపించి “హెచ్.ఎం సుభాష్ గారు ఉన్నారా సార్ “అని అడిగాడు.”నేనే సుభాష్ చెప్పండి ఎవరు మీరు” అన్నాడు హెచ్.ఎం సుభాష్.”నేను డిటెక్టివ్ నితీష్.అసలు విజయ్ గారు నిన్న బడికి వచ్చారా.”అడిగాడు నితీష్.”వచ్చారండి మధ్యాహ్నం రెండు గంటలకి వాళ్ళ అమ్మకి బాగోలేదని పర్మిషన్ అడిగి వెళ్ళారు.ఎందుకడుగుతున్నారు.”అని సుభాష్ అనడంతో “ఏం తెలియనట్లు నటించకండి సార్.మీకూ విజయ్ సంఘటనకి ఏదో సంబంధం ఉన్నట్లుంది. లేకపోతే నా దగ్గర ఎందుకు నటిస్తారు “అన్నాడు నితీష్.ఆ మాటతో సుభాష్ హడలెత్తిపోయి ఎందుకడుతున్నారు అన్నాను కానీ నాకు ఏమీ తెలియదు అనలేదు సార్.ఆటో అయ్యోరికి నాకు అవినాభావ సంబంధం ఉంది.నేనూ ఆయన క్లాస్ మేట్స్.చిన్నప్పటి నుంచి ఆటో అయ్యోరి గురించి నాకు అన్నీ తెలుసు అంటూ బాధపడ్డాడు.ఆటో అయ్యోరెవరండీ అన్నాడు నితీష్.విజయ్ గారిని అందరూ ఆటో అయ్యోరు అంటారు.అసలు ఆయన నిన్నటి నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు సుభాష్.సార్ ని ఆటో అయ్యోరని ఎందుకంటారు చెప్పండి అని నితీష్ అడగడంతో సుభాష్ సార్ విజయ్ కథని మొదలెట్టాడు.
“విజయ్ సార్ రోజూ ఆటోలో స్కూల్ కి వచ్చేవాడు.ఆయనకి బైకు ఉన్నా సరే బడికి ఆటోలోనే వచ్చేవాడు.ఎందుకని అడిగితే వాళ్ళ నాన్న ఆటో నడిపి ఇంటిని నడిపిస్తూ చివరి క్షణంలో కూడా ఆటో నడుపుతుండగానే హార్ట్ ఎటాక్ తో మరణించాడు,వాళ్ళ నాన్న చివరి కోరిక ఆటో వాడి కొడుకు అని చులకనగా ఎవరైనా అంటే బాధపడకు,సొంత కాళ్ళపై నిలబడ్డ ఆటో డ్రైవర్ కొడుకునని గర్వంగా చెప్పమన్నాడని ఆటోలోనే వస్తాను సార్ అంటూ చెప్పేవాడు.అందుకే ఆయన్ని ఆటో అయ్యోరు అని పిలిస్తే ఎంతో ఆనందపడేవాడు.”
అంటూ సుభాష్ చెప్పడంతో అంతా విని నితీష్”ఆయనకి శత్రువులెవరూ లేరా అని అడిగాడు.సుభాష్ ఆయనకి శత్రువులే లేరు అన్నాడు.నితీష్ వెంటనే ఎస్.ఐ శివశంకర్ కి ఫోన్ చేసి యాక్సిడెంట్ స్పాట్స్ లో ఆటో యాక్సడెంట్స్ గురించి చెక్ చెయమన్నాడు.నితీష్ నేరుగా ఆటో అయ్యోరు వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళాడు అక్కడ సమాచరమంతా సేకరించగా ఆయన బడి నుంచి హాస్పిటల్ కి రాకుండానే మిస్ అయ్యాడని అర్థం అయింది.శివశంకర్ ఫోన్ చేసి “ఆటో యాక్సిడెంట్ ఏమీ జరగలేదు నితీష్ “అని చెప్పడంతో నితీష్ మీరు బడి దగ్గర నుంచి హాస్పిటల్ మధ్యలో ఖాళీ ప్రదేశాలు,కాలువలు ,బ్రిడ్జిల కింద అంతా వెతకమన్నాడు.శివశంకర్ తన టీమ్ తో వెతుకుతుండగా ఆటో ఓ పెద్ద గుంటలో ఉండడం గమనించారు.దానిని బయటకి తీసి ఆటో అయ్యోరి శవం కోసం వెతకగా కనపడలేదు.దాంతో ఆటో అయ్యోరి మరణాన్ని దృవీకరించి ,శవం గల్లంతని నివేదికను సబ్మిట్ చేసి కేసును క్లోజ్ చేసేశాడు.సుభాష్ ఆటో అయ్యోరు చనిపోయాడంటే నమ్మకం కుదరలేదు.నితీష్ దగ్గరికెళ్ళి “సార్ మీరు కూడా విజయ్ చనిపోయాడనుకుంటున్నారా” అన్నాడు.నితీష్ “లేదు సార్ ,ఆటో అయ్యోరు బతికే ఉన్నాడు”అనడంతో సుభాష్ ఆశ్చర్యంతో “బతికే ఉన్నాడా ..ఎక్కడ ..”అంటూ ఆనందం నిండిన కళ్ళను విప్పార్చి చుట్టూ వెతికాడు.సార్ తొందరపడకండి. ఆయన నిన్నటి నుంచి స్కూల్లోనే ఉన్నాడు అనడంతో స్కూల్లోనా నమ్మేలా చెప్పండి సార్ అంటూ అపనమ్మకంతో చూశాడు.ఇద్దరూ స్కూల్ కి వెళ్ళారు అక్కడ లైబ్రరీ లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండగా పక్కనే ఎస్.ఐ శివశంకర్ కూడా ఉన్నాడు.సుభాష్ కి ఏమీ అర్థంకాక అసలేం జరిగింది సార్ అని అడిగాడు.

“నేను అమ్మ ఆపరేషన్ కి హాస్పిటల్లో కట్టాలని ఐదు లక్షలు తీసుకెళ్తున్న విషయం రౌడీ నరసింహులు చెవిన పడడంతో తన గ్యాంగ్ తో నా ఆటోని వెంబడించారు. నాకు విషయం అర్థమైపోయి పెద్ద గుంట దగ్గర ఆపి దిగేసి ఆటోని ఫాస్ట్ గా రైజ్ చేసి గుంటలోకి తోసేశా.వాళ్ళు ఆటోని లాగి నన్ను కాపాడి డబ్బు తీసుకోవాలని చాలా ప్రయత్నించారు కానీ విఫలమై వెళ్ళిపోయే సమయంలో నరసింహులు కి అనుమానం వచ్చింది మనిషి చనిపోతే నీళ్ళల్లో తేలాలి అని నీటిని మొత్తం వెతికారు నేను లేకపోవడంతో అయ్యోరెలా మాయమయ్యాడురా ఏదో కిరికిరి చేశాడు అనుకొని ఇద్దర్ని కాపలా పెట్టాడు.నేను నేరుగా స్కూలికి వచ్చి లైబ్రరీలో దాక్కొని ఎస్.ఐ కి మా నాన్న లా కంప్లైంట్ ఇచ్చా.డిటెక్టివ్ నితీష్ మీ ద్వారా మా నాన్న లేడని తెలుసుకొని ఫేక్ కంప్లైంట్ అని ఎస్.ఐ కి చెప్పడంతో ఫోన్ నంబర్ ట్రేస్ చేసి నా దగ్గరికొచ్చారు. నేను రౌడీల గురించి చెప్పడంతో నరసింహులు జాడకోసమని నేను చనిపోయినట్లు అక్కడ ప్రకటించి ఆ ఇద్దరి రౌడీలని ఫాలో అయి నరసింహులు ని అరెస్ట్ చేశాడు.నితీష్ గారు మా అమ్మ ఆపరేషన్ దగ్గరుండి చేయించారు.”అంటూ జరిగిన విషయాన్ని చెప్పడంతో సుభాష్ అవాక్కై చూస్తూ నా చుట్టూనే ఇంత జరిగిందా అనుకుంటూ ఆటో అయ్యోరిని కౌగిలించుకున్నాడు. శివశంకర్,నితీష్ లను పొగుడుతూ ఆటో అయ్యోరి తార్కిక ఆలోచనకి చేతులు జోడించి నమస్కరించాడు సుభాష్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!