నిజమైన ప్రేమ

నిజమైన ప్రేమ

రచయిత :: పుల్లూరి సాయి ప్రియ

అందమైన గులాబి పూలతో కూడిన ఒక నందనవనం. ఆ నందన వనంలో ఎన్నో సీతాకోకచిలుకలు, తుమ్మెదలు, అందమైన పక్షుల కిలకిలలతో ఆనందంగా విహారం చేస్తున్నాయి.
అందులో ఓ తుమ్మెద ఒక సీతాకోకచిలుకను గాడంగా ప్రేమిస్తుంది.ఆ తుమ్మెద తన ప్రేమ గురించి చెప్పాలని గులాబి తోటలో ఉన్న సీతాకోకచిలుక దగ్గరికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేసింది.సీతాకోకచిలుక కాసేపు ఆలోచించి, సరే ఒప్పుకుంటాను. కాని ఒక షరతు అని చెప్పింది. అప్పుడు ఆ తుమ్మెద ఎక్కడ లేని సంతోషంతో రివ్వున ఎగిరి ఒకసారి ఆ గులాబి తోట చుట్టూ తిరిగి వచ్చి, సరే ఇక ఆ షరతు ఏంటో చెప్పు అని అడిగింది. దానికి సమాదానంగా, ఆ సీతాకోకచిలుక నీ ప్రేమ నిజమైన ప్రేమ అని ఏలా నమ్మాలి నేను. అందుకే ఈ షరతు పెడుతున్నా అని, ఈ గులాబి తోటలో అన్ని తెల్ల గులాబిలే ఉన్నాయి కదా అన్ని వద్దు కాని ఒక గులాబి రేపు ఉదయం వరకు తెల్లని వర్ణం నుండి ప్రేమ వర్ణం అయిన ఎరుపు వర్ణం లోకి మారిందంటె నీ ప్రేమ నిజమైనది అని నేను జీవితాంతం నమ్ముతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. తుమ్మెద అది ఏలా సాద్యం అని ఆలోచిస్తూ, ఆలోచిస్తూ అక్కడ నుండి వెళ్లిపోయింది.
మరుసటి రోజు తెల్లవారగానే ఆ సీతాకోకచిలుక వెంటనే గులాబి తోటకి వెళ్లి ఆ గులాబి తోటలో ఉన్న తెల్ల గులాబిని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ తెల్లని గులాబి ఎరుపు రంగులోకి మారిపోయింది. అప్పుడు ఆ సీతాకోకచిలుక ఆనందం మాటల్లో చెప్పలేనిది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది.. నాకు తెలుసు తనపై నాకు ఎంతో నమ్మకం ఉంది.అని అనుకొని, అయిన ఈ గులాబీ ఎరుపు రంగులోకి మారకపోయిన నేను నిన్ను ప్రేమించె దానినే అని తన మనసులో అనుకుంది.
ఇక ఆ సీతాకోకచిలుక ఆ తుమ్మెద కోసం ఎదురుచూస్తు ఉన్నది. సాయంకాలం అవుతుంది అయిన కూడ ఆ తుమ్మెద ఇంక రావడం లేదు. తన కోసం ఎదురు చూసి చూసి తన కళ్ళు కాయలు కాస్తున్నాయి ఆయిన సరే అని ఇంక ఎదురుచూస్తూనే ఉంది. ఇంతలో వెలుతురు చీకటి ముసుగును కప్పుకుంది.అక్కడి నుండి వెళుతున్న మరొక సీతాకోకచిలుక ఆ సీతాకోకచిలుక దగ్గరికి వచ్చి ఉదయం నుండి ఇక్కడే ఉన్నావు. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టు ఉన్నావు. అని అడగగానే ఆ సీతాకోకచిలుక నువు చెప్పింది నిజమే. అవును తుమ్మెద కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పగానే, ఆ సీతాకోకచిలుక, ప్రేమించిన సీతాకోకచిలుకతో భాదగా నీకు ఒక విషయం చెప్పాలి నువు తుమ్మెద తో ఏదో షరతు పెట్టావంట కదా మీ ప్రేమ నిజం అని నీకు నమ్మకం కుదరాలి అని తన ప్రాణాల్ని కూడ లెక్కచేయకుండా ఆ తెల్ల గులాబి దగ్గరికి వెళ్లి ఆ గులాబీ పై తన రక్తాన్ని చల్లించి దానిని ఎర్ర గులాబి గా మార్చాడు.తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అని చెప్పగానే ఆ సీతాకోకచిలుక అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. పాపం ఆ మాట వినగానే అది కూడ చనిపోయింది.ఇది చూసిన ఆ సీతాకోకచిలుక మీరు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు విడిచేంతా ప్రేమను కలిగిఉన్నారే..ఇదే కదా నిజమైన ప్రేమ అంటె.. మిమ్మల్ని నేను ఎప్పటికి మార్చిపోలేను నా ప్రియమైన స్నేహితుల్లారా..అని బాధతో అక్కడి నుండి వెళ్లిపోయింది సీతాకోకచిలుక.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!