పోస్ట్ కార్డు

పోస్ట్ కార్డు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: V T రాజగోపాలన్

గిరీశం గారు వాలు కుర్చీలో పడుకుని.”ఒరేయ్ ప్రసాదు ఇలా రారా!” ఏం తాతయ్యా, ఎందుకు పిలిచావ్? నాకో పని చేసిపెట్టు, అలా పక్కవీధిలోని పోస్టాఫిసుకు వెళ్లి ఓ కార్డ్ ముక్క పట్టుకురావోయ్. ఎందుకు తాతా.. చెప్తే గానీ చెయ్యవా! ‘అలా కాదు ఎందుకో తెలుసుకుందామని’ “నా స్నేహితుని పుట్టినరోజు వస్తుంది, వాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తామని”. “అయ్యో తాతా దానికి, గ్రీటింగ్ కార్డు పంపాలి, నేను బజారుకెళ్లి మంచి కార్డు తీసుకొస్తాను, సరేనా.” వద్దులే నాన్నా,  వాడికి నేను వ్రాసిన అక్షారాలు చూస్తే, నన్ను చూసినంత సంతోషం కలుగుతుంది. “పాత తరం మరువరాదు, ఏదో మేమున్నంతవరకు ఇలా గడిపేస్తాం నాన్నా.” సరేలే మీ ఆశ ప్రకారమే చేద్దాం,  పైసలివ్వు తాతా,  పోస్టుకార్డును తీసుకొస్తా అంటూ జారుతున్న చెడ్డీని పైకి లాగుకుంటూ, తాత దగ్గర నిలబడ్డాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!