ప్రాణం ఉన్న బొమ్మని

అంశం: నేనో వస్తువుని

ప్రాణం ఉన్న బొమ్మని
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చెరుకు శైలజ

నేను ఒక వస్తువుని
ఎవరికి అవసము లేని ఒక వృద్ధ అమ్మని
అన్ని వస్తువులు పక్కకి పెట్టినట్లే
నన్ను ఓ పక్కకి పెట్టారు
అదే వస్తువు అయితే దాని పని అయిపోయింది అని బయట పడేస్తారు.
మరి నేను మనిషి అనే చలనం వున్న
వస్తువును కదా
నన్ను బయట పరేయలేక
సమాజానికి భయపడి పరుల కోసం
నన్ను ఇంట్లోనే ఒక మూలన కూర్చో పెట్టారు.
ఒకప్పుడు నన్ను అన్ని అవసరాలకి పిలుస్తూనే వుండే నా వాళ్ళు
ఇప్పుడు అసలు పిలవడం మానేశారు
ఇంటి నిండ మనుషులు ఉన్న
నేను ఏ కాకిని
చలనం లేని వస్తువుని
ఎప్పుడైనా
ఎవరైన గది లోకి వచ్చి పలకరించ పోతారా! అని
ఆశగా ఎదురు చూస్తూ వున్న
ఒక నిర్జవ రూపాన్ని
ఎవరైనా వయసులో వున్నపుడే
లేకపోతే డబ్బులు వున్నప్పుడే
మనచుట్టూ చేరి పలకరించే మనవాళ్ళు
ఆ రెండు లేకపోతే ఎవరు మనవైపు చూడరు
నా మనసులోనే మదన పడుతు
ఏమి అడగలేక, ఉన్నది చెప్పలేక
నాలో నేను బాధ పడుతూ
చివరి పిలుపు కోసం ఎదురు చూస్తూ
దేవుడైన తొందరగా పిలిస్తే బాగుండు
అవేదన పడే ఒక అమ్మని
ప్రాణం వున్న ప్రాణం లేని బొమ్మని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!