ప్రేమ కావాలి…

ప్రేమ కావాలి…

రచయిత: జీ వీ నాయుడు

ప్రేమా ప్రేమా… ఓ ప్రేమా
ఎక్కడ ఎక్కడ దాక్కొన్నావో
అంటుంది జనసంద్రం

వచ్చాయి సెల్ ఫోన్లు
తెచ్చాయి ఎన్నెన్నో తంటాలు

కరువవుతున్నాయి ప్రేమలు
కట్టలు తెగుతున్నాయి కోపతాపాలు.

భార్యా భర్తల మధ్య
కొరవడుతుంది సఖ్యత

పెరుగుతుంది అంతరం
తరుగుతుంది ప్రేమ బంధం

ప్రేమ జంటల్లోను ఇదే తంతే
నగుబాట్లు అవుతున్నాయి
చేతిలో చెయ్యేసిన బాసలు.

ఎవరికీ వారే యమునాతీరే
కాలగర్భంలో కలుస్తున్నాయి
పెళ్లినాటి ప్రమాణాలు నేడు.

పాశ్చాత్య దేశాలకే పరిమితం
అయ్యేవి విడాకుల విహంగాలు

నేడు మనకు కూడా అంటుకున్నాయి విడాకుల
విదేశపు కుసంప్రదాయాలు

కావాలి కావాలి కావాలీ
అలనాటి ప్రేమానురాగ ఆప్యాయతలు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!