వీడ్కోలు పలికి రారా!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: వడలి లక్ష్మీనాథ్
వీడ్కోలు పలికి రారా విజయుడా!
అమ్మ ఒడిలో ఉగ్గుపాలతో నేర్చిన
అ ఆ లు, కమ్మనైన అమ్మ చేతి వంట,
పల్లె పచ్చని పచ్చికలో వల్లె వేసిన పాఠాలు
కోతి కొమ్మచ్చి ఆడిన స్నేహితులు,
నిక్షిప్తమైన నీ మధుర జ్ఞాపకాలు.
వీడ్కోలు పలికి రారా విజయుడా!
పెద్ద చదువంటూ, పేదోడి గూడు వీడి,
సంపన్న దేశమంటూ ఊసులెన్నో చెబుతూ
ఊడిగం చేస్తున్న ఓ భారతీయుడా !
వీడ్కోలు పలికి రారా విజయుడా!
ఎదురు చూసే నీకు జన్మనిచ్చిన అమ్మ,
ఎదురు చూసే నీవు పెరిగిన గాలి, మట్టి,
నిన్ను మేధావిగా తీర్చిదిద్దిన నీ గురువు.
వెనువెంటనే రారా వీడ్కోలు పలికి
రుణం తీర్చుకో, ఈ భూమికి
చెయ్యాలి సేవ నీ మేధస్సుతో,
వీడ్కోలు పలికి రారా విజయుడా!
బాగుందండి