వీడ్కోలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
నిన్నకు వీడ్కోలు పలుకు,
రేపటికి ఆహ్వానం పలుకు!
నిన్న కిందపడ్డానని బాధపడకు,
రేపటి సూర్యోదయం నీదే,
కొత్తదారులు,కొత్త ఊహలు
కొత్తప్రపంచం నీదే!
నిన్నటి అనుభవంతోటి
రేపటి జీవితాన్ని నిర్మించు,
మహనీయుల జీవితచరిత్రలు ఇదే చెబుతున్నాయి,
పదిమందికి దారిచూపే
దీపం నువ్వేకావాలీ,
మనిషి మనీషి అయ్యేది
అనుభవంతోటే!