(అంశం: “ఏడ తానున్నాడో”)
నా వెండి మామ
రచన : దొడ్డపనేని శ్రీవిద్య
ఏడ తానున్నాడో మామ
అల గగనాన నీలి ఆకశాన
నల్లటి మబ్బుల మాటున
తొంగి చూస్తూ కవ్విస్తూ
కొంటె కొంటె నవ్వులతో
అలరిస్తూ మురిపిస్తూ
నడి రేయి ఝాము దాటినా
రాడే నా నిండు జాబిలి
పండు వెన్నెలనీయడే
చల చల్లగ వెదజల్లే
పరిమళాలతో
మది పులకించే సరాగాలతో
తారా మణులు ఎదురుచూపులో
కోటి భావాలు పలికినే
ముద్దుల మా వెండి మామ
ఏడ తానున్నాడో మా చందమామ
కాన రాడే ఈ వేళ