చిన్న నాటి దీపావళి

చిన్న నాటి దీపావళి
     (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: k. లక్ష్మీ శైలజ   

        “చిరంజీవి  కుం.సౌ. రాణిని ఎంతో ఆశీర్వదించి మీ అక్క వ్రాయు ఉత్తరము”. ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. ఈ సారి దీపావళికి నాకెందుకో మీరంతా గుర్తుకు వచ్చారు. మన పెళ్లిళ్లయ్యి ఇన్నేళ్ళయినా ప్రతీ పండుగకు స్వర్గంలో ఉన్న అమ్మను తలచుకోకుండా నాకు పండుగే జరగడం లేదు.
“దీపావళికి రెండు రోజుల ముందే టపాకాయలు  చాటలల్లో ఎండబెట్టు కోవడం మనం చేస్తే, వాటిని నలుగురు పిల్లలకూ సమానంగా పంచి ఇచ్చేది”.
నరకచతుర్దశి రోజు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు అమ్మలేచి ఆనేకాగుకింద మంటపెట్టి వేడినీళ్ళు కాగాక మనలను లేపితే, అమ్మ బైట కసువు ఊడ్చి, పేడనీళ్ళు చల్లేప్పటికి మనం లేచేవాళ్ళం. మనం పీటమీద కూర్చుంటే అమ్మ మనకు కుంకుమ పెట్టీ, ఆముదంతో తల అంటేది.
ఆ తరువాత అందరూ తలా కొంచెం టపాకాయలు కాల్చి స్నానం చెయ్యమనేది. “మనం పెద్ద పెద్ద ముగ్గులు వాకిట్లో వేసిన తరువాత “నాకూ ఒక కాకరవత్తి ఇవ్వండిరా! నరకారకాసున్ని చంపివస్తాను,” అని వాకిట్లో ఒక కాకరవత్తి కాల్చి, ఒక స్త్రీ గా సత్యభామ దేవినీ తలుచుకునే గర్వపడేది. దీపావళి పండుగ అమ్మచేసే భక్ష్యాలు తిని, రాత్రికి కాల్చే టపాకాయలతో పూర్తయ్యేది. టపాకాయలు నువ్వు భయంతో కాల్చలేక, నీవన్నీ మాకిచ్చేసేదానివి. అవన్నీ తలచుకుంటూ వుంటే ఎంతో సంతోషంగా ఉంటుందిప్పుడు.

                        ఇంతే ఆశీస్సులతో
అక్క

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!