సంతోషాల పొదరిల్లు(సంక్రాంతి కథల పోటీ)

సంతోషాల పొదరిల్లు 

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: తాడూరి సుమతి

అప్పుడు టైమ్ 4pm అవుతుంది, కాలేజీ అయిపోయి, హాస్టల్ కీ వచ్చింది సిరి.

సిరి గుజరాత్ లోని “parul univarcity “లో చదువుతుంది, దసరా పండుగకి కూడా ఇంటికి వెళ్ళలేదు, దీపావళి కీ one month హాలిడేస్ ఇచ్చారు, అమ్మ నాన్న, పిన్ని బాబాయ్, అమ్మమ్మ తాతయ్యను, ఇలా అందరినీ కలసి వచ్చింది.

ఫ్రెండ్స్ తో కలిసి కాంటీన్ కీ వెళ్లొచ్చింది, రోజు ఈ చపాతీలు పప్పు, తినలేక , విసుగు వచ్చేసింది, నోటికి రుచి తగిలి ఎన్ని రోజులైంది, కదే సిరి అంది దీప్తి.

ఆవును, ఏది తిన్న, కొంచెమైనా అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది, ఈ చపాతీలు తిన్న కూడా, సగం కడుపు మాడుతుందే అంది సిరి.

చదువు కోసం ఇంత దూరం వచ్చాము, ఈ కరోనా వల్ల ఇంటికి వెళ్లలేక పోతున్నాము, ఇంకో one month లో సంక్రాంతి పండుగ ఉంది. ఆ పండుగ రోజు, మా ఇల్లు, సంతోషాల పొదరిల్లుల ఉంటుంది, ఎందుకంటే, అందరూ ఒకే దగ్గరకు ఉండి ఈ పండుగ చేసుకుంటారు, అమ్మమ్మలు, నాన్నమలు -తాతయ్యలు –అక్క బావలు –పెద్దనాన్న, చిన్నాన్నలు అందరూ, ఎక్కడెక్కడో ఉన్న, ఈ సంక్రాతికి అందరూ ఒకేదగ్గర,, ఐచ్చికం గా ఉండి పండుగ జరుపుకుంటారు. అని సిరి అనగానే……

అవునా సిరి,, మీ దగ్గరకు పండుగ అంత బాగా చేస్తారా, ఇలా చేస్తుంటారో నాకు చెప్పవా అని అడిగింది దీప్తి.

చెప్తాను అని దీప్తి……
ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటారు, బోగి —మకర సంక్రాంతి –కనుమ , ఇంకా పొద్దునే బోగి మంట వేస్తారు.ముఖ్యంగా ఈ పండుగకి , సకినాలు -అర్షలు పిండి వంటలు చేస్తారు. బోగి రోజు తెల్లవారుజామున కొడుకుయక ముందే లేచి, ఇల్లంత కడిగి, వాకిలి ఊడ్చి, పెండతో కల్లాపి చల్లి రంగుగుల ముగ్గులు పెడతారు, ఆవు పెడతో , గోబ్బేమలు, చేసి ముగ్గులో పెట్టి, వాటిపై గరక, పిండి పువ్వు, రేగు పండ్లు, నావధాన్యలు, పసుపు కుంకుమ పూలు, వేస్తారు,పాలు పొగించి, పొంగలి చేస్తారు,ఇంకా చిన్నపిల్లలకు, బోగి పండ్లు పోస్తారు.మరుసటి రోజు సంక్రాంతి, అందరూ కొత్త బట్టలు వేసుకొని, ఇష్టమైన వంటలు చేసుకొని, అందరూ కలసి కబుర్లు చెప్పుకుంటారు, మూడోరోజు కనుమ, ఇంటి నిండా రథం ముగ్గులు వేస్తారు, ఇంకా ఊళ్ళో ముగ్గుల పోటీలు పెడతారు, నాకు ముగ్గుల పోటీలి పాల్గొనడం చాలా ఇష్టం, ప్రతి సంవత్సరం, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఈసారి, మా పొదరింటిని, ఆ ముగ్గుల పోటీని మిస్ అవుతున్నాను, అని సిరి చెప్పగానే…..

అవునా సిరి నువ్వు చెప్తుంటే, పండుగంత ఇక్కడే కనిపిస్తుంది , ఈసారి పండుగకీ హాలిడేస్ వస్తే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది దీప్తి.

తప్పకుండ తీసుకెళ్తాను అంది సిరి..

సరే సిరి వెళ్లి పడుకో నాకు నిద్రొస్తుంది, అనుకుంటూ వెళ్లి పడుకుంది దీప్తి.

సిరి తన సంతోషాల పొదరింటిని, తలుచుకుంటు మెల్లిగా నిద్రలోకి జారుకుంది.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!